తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Third wave: 'కరోనా మూడో దశ అనివార్యం' - కరోనా మూడో దశ వ్యాప్తి

కొవిడ్​ వైరస్​ మూడో దశ ఉద్ధృతి అనివార్యమని అన్నారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. వైరస్​పై పోరాడేందుకు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.

kejriwal
దిల్లీ సీఎం, అరవింద్ కేజ్రీవాల్

By

Published : Jun 12, 2021, 2:03 PM IST

దేశంలో కరోనా వైరస్ మూడో దశ(corona third wave) సంభవించే అవకాశాలు మెండుగా ఉన్నాయని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Kejriwal) ఉద్ఘాటించారు. మూడో దశను ఎదుర్కొనేందుకు యుద్ధప్రాతిపదికన పోరాడుతున్నట్టు వెల్లడించారు.

మూడో వేవ్ వచ్చే అవకాశముందని చెప్పడానికి బ్రిటన్​లో కేసుల సంఖ్య పెరుగుతుండటం ఓ ఉదహరణ అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. 45 శాతం వ్యాక్సినేషన్​ ప్రక్రియ జరిపినప్పటికీ అక్కడ వైరస్​ మళ్లీ విజృంభిస్తోందని గుర్తుచేశారు.

ఓ ఆన్​లైన్​ కార్యక్రమం ద్వారా.. 22కొత్త పీఎస్​ఏ ఆక్సిజన్​ ప్లాంట్లను ప్రారంభించారు కేజ్రీవాల్​. దిల్లీవ్యాప్తంగా 9ఆసుపత్రుల్లో ఈ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

కొవిడ్​ రెండో దశ ఉద్ధృతి నేపథ్యంలో.. ప్రజలు కలిసికట్టుగా వైరస్​పై పోరాటం చేశారని కేజ్రీవాల్ గుర్తుచేశారు. మూడో దశ రాకూడదని.. ఒకవేళ వచ్చినా ఐకమత్యంతో వైరస్​పై పోరాడాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:'పిజ్జాలే ఇస్తుంటే.. ఇంటికే రేషన్​ ఎందుకొద్దు?'

ABOUT THE AUTHOR

...view details