కొత్త ఐటీ నిబంధనలపై కేంద్రానికి దిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వాట్సాప్, ఫేస్‌బుక్ దాఖలు చేసిన పిటిషన్‌పై సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.
ఐటీ నిబంధనలు-2021లోని 4(2)ను వాట్సాప్, ఫేస్‌బుక్ సవాల్ చేస్తూ.. పిటిషన్ దాఖలు చేశాయి. ఐటీ నిబంధనల్లో 4(2) నియమం భావ ప్రకటన స్వేచ్ఛకు విరుద్ధమని అందులో పేర్కొన్నాయి. దీని ద్వారా వినియోగదారుల గోప్యతకు భంగం కలుగుతుందని వివరించాయి. ముఖ్యంగా 'ట్రేసబిలిటీ' విధానానికి సంబంధించిన నిబంధనను సవరించాలని వాట్సాప్ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ తన వాదనను వినిపించారు.