తెలంగాణ

telangana

By

Published : May 16, 2021, 5:10 PM IST

Updated : May 16, 2021, 5:20 PM IST

ETV Bharat / bharat

ఇకపై రోజూ రేషన్​ సరకులు పంపిణీ!

రేషన్ షాపులను నెలలో ప్రతి రోజూ తెరిచే ఉంచాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. కరోనా కట్టడికి రాష్ట్రాలు విధించిన ఆంక్షలతో పలు చోట్ల పరిమిత సమయంలోనే రేషన్ పంచుతున్నారని కేంద్రం తెలిపింది.

Ration Shops timings rise
రేషన్ షాపుల సమయం పెంపు

కరోనా నేపథ్యంలో ప్రజలకు ఆహార కొరత సమస్య రాకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక సూచనలు చేసింది కేంద్రం. నెలలో అన్ని రోజులు రేషన్ షాపులు తెరిచి ఉంచాలని ఆదేశించింది. రాయితీ, ఉచిత ఆహార ధాన్యాలను పేదలకు సురక్షితంగా, కొవిడ్ నిబంధనలను పాటిస్తూ సరఫరా చేసేలా చర్యలు చేపట్టాలని తెలిపింది.

లాక్​డౌన్ కొనసాగుతున్నా.. రేషన్ షాప్​ల సమయాన్ని పొడిగించాలని సూచించింది కేంద్రం. సమయం కుదించడం వల్ల అందరికీ రేషన్ అందకపోవచ్చని పేర్కొంది.

జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్​ఎఫ్​ఎస్​ఏ) ద్వారా ప్రతి నెల ఒక్కో వ్యక్తికి 5 కిలోల ఆహార ధాన్యాన్ని రూ.1-3లకు అందిస్తోంది కేంద్రం. దీని ద్వారా దాదాపు 80 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు. కరోనా నేపథ్యంలో వారందరికి ప్రధాన్ మంత్రి గరీబ్​ కల్యాణ్​ అన్న యోజన ద్వారా 5 కిలోల ఆహార ధాన్యాన్ని ఉచితంగా ఇస్తోంది. కొవిడ్ రెండో దశ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఉచితంగా రేషన్​ మే-జూన్ వరకు అమలు చేస్తోంది.

ఇదీ చదవండి:దిల్లీ సహా మరో రెండు రాష్ట్రాల్లో లాక్​డౌన్ పొడిగింపు

Last Updated : May 16, 2021, 5:20 PM IST

ABOUT THE AUTHOR

...view details