తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వారికి రేషన్​ కార్డులు అందేలా చూడండి : కేంద్రం

నిరుపేదలు, ఆర్థికంగా బలహీనంగా ఉన్నవారికి రేషన్​ కార్డులు అందించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం సూచించింది. వారందరినీ జాతీయ ఆహార భద్రత చట్టం(ఎన్​ఎఫ్​ఎస్​ఏ) పరిధిలోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని చెప్పింది.

ration cards news
రేషన్​ కార్డులపై కేంద్రం సూచనలు

By

Published : Jun 3, 2021, 7:56 PM IST

నిరుపేదలు సహా సమాజంలో ఆర్థికంగా బలహీనమైన వర్గాల వారిని గుర్తించి.. వారికి రేషన్​ కార్డులను అందజేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం సూచించింది. వారందరినీ జాతీయ ఆహార భద్రత చట్టం(ఎన్​ఎఫ్​ఎస్​ఏ) పరిధిలోకి తీసుకురావాలని చెప్పింది. చాలా మంది నిరుపేదలు..రేషన్​ కార్డులు లేనందున ఆహార ధాన్యాలను పొందలేకపోతున్నారని వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈ సూచనలు చేసింది.

"రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కలిసి 1.97 కోట్ల మందిని ఎన్ఎఫ్​​ఎస్ఏ పరిధిలోకి తీసుకువచ్చేందుకు అవకాశం ఉంది. ఇప్పటివరకు 14 రాష్ట్రాలు ఈ కోటాలో 100 శాతాన్ని పూర్తి చేశాయి. ప్రస్తుత కరోనా సమయంలో.. అర్హులైన లబ్ధిదారులను గుర్తించి ఎన్​ఎఫ్​ఎస్​ఏ పరిధిలోకి తీసుకురావటం అత్యంత ప్రాధాన్యమైన అంశం."

-ఆహార కార్యదర్శి సుధాన్షు పాండే

వీధుల్లో నివాసం ఉండేవారు, చెత్త ఏరుకునే వారు, వీధి వ్యాపారుల వంటి వారికి చిరునామా గుర్తింపు​ లేనందున.. వారు రేషన్​ కార్డు పొందలేకపోతున్నారని కేంద్రం చెప్పింది. అలాంటి వారిని గుర్తించి రేషన్ కార్డులు అందజేయాలని సూచించింది.

ఇదీ చూడండి:'ఆర్థిక నేరస్థుల విషయంలో మా వైఖరి అదే'

ఇదీ చూడండి:ఆ చిన్నారుల సంరక్షణకు కేంద్రం మార్గదర్శకాలు

ABOUT THE AUTHOR

...view details