సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై తప్పుడు కథనాలు సృష్టిస్తున్నారని విపక్షాలపై కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్ సింగ్ పూరీ మండిపడ్డారు. ఈ ప్రాజెక్టు ఆడంబరం కోసం కాదని, అత్యవసరమని అన్నారు. ప్రధానమంత్రి నివాసానికి సంబంధించి ఎలాంటి డిజైన్ ఖరారు కాలేదని చెప్పారు. పార్లమెంట్ భవనం, సెంట్రల్ విస్టా అవెన్యూ నిర్మాణం మాత్రమే కొనసాగుతున్నట్లు స్పష్టం చేశారు. రూ. 1300 కోట్లతో ఈ పనులు జరుగుతున్నాయని వివరించారు.
"సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై తప్పుడు కథనాలు నా దృష్టికి వచ్చాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా ఏ ఇతర వారసత్వ భవనాన్ని మేం ముట్టుకోలేదు. ఇది ఆడంబర ప్రాజెక్టు కాదు. అత్యవసర ప్రాజెక్టు."