Central Minister Amit Shah Speech at Kollapur Sabha in Telangana : కాంగ్రెస్ పార్టీ రాహుల్‌యాన్‌ను ఇప్పటికే 20 సార్లు ప్రయోగించినా.. విజయవంతం కాలేదని బీఆర్‌ఎస్ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా(Amith Shah) విమర్శలు చేశారు. ఈ రాహుల్‌యాన్‌ను విజయవంతం చేయాలని హస్తం పార్టీ చూస్తోందన్నారు. ఇప్పటికే ప్రధాని మోదీచంద్రయాన్-3ని విజయవంతం చేశారని తెలిపారు. కొల్లాపూర్‌లో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభ.. మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్‌లో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన పాల్గొని.. ప్రసంగించారు.
ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులంతా నిన్నటి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలేనని కేంద్రమంత్రి అమిత్‌షా ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు ఓటు వేయడమంటే.. అవినీతిపరులకు, మైనార్టీలకు వేసినట్లేనని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ చంద్రయాన్-3 విజయవంతం చేశారని.. కానీ కాంగ్రెస్ మాత్రం రాహుల్‌యాన్‌ను విజయవంతం చేయాలని చూస్తోందని ఎద్దేవా చేశారు.
బీజేపీ ప్రభుత్వం రాగానే - మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేస్తాం : అమిత్ షా
Telangana Elections 2023 : రాష్ట్రంలో బీఆర్‌ఎస్ సర్కార్ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందన్న అమిత్‌షా.. కాళేశ్వరం ప్రాజెక్టులో(Kaleshwaram Project) లక్ష కోట్ల అవినీతి జరిగిందని తెలిపారు. లక్షన్నర కోట్లతో నిర్మించిన మేడిగడ్డ ప్రాజెక్టు మూడేళ్లకే కుంగిపోయిందని అన్నారు. మిషన్ కాకతీయలో రూ.22 వేల కోట్ల అవినీతి జరిగిందన్నారు. ఔటర్ రింగ్‌రోడ్డు లీజులో వేల కోట్ల అవినీతి జరిగిందని చెప్పారు. భూముల వేలంలో బీఆర్‌ఎస్ సర్కార్ రూ.4 వేల కోట్ల అవినీతికి పాల్పడిందని ఆరోపించారు.