Andhra Pradesh High Court latest news: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తరలింపునకు సంబంధించి.. కేంద్ర ప్రభుత్వం పలు కీలక విషయాలను వెల్లడించింది. పునర్విభజన చట్టం ప్రకారమే.. హైకోర్టు అమరావతిలో ఏర్పాటైందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు.. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు లిఖితపూర్వక సమాధానాలను ఇచ్చారు.
''పునర్విభజన చట్టం ప్రకారమే.. ఏపీ హైకోర్టు అమరావతిలో ఏర్పాటైంది. కర్నూలు జిల్లాకు హైకోర్టును తరలిచాంలంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి నిర్ణయించాలి. ఏపీ హైకోర్టు తరలింపు ప్రస్తుతం కోర్టుల పరిధిలోనే ఉంది. విభజన చట్టం ప్రకారం అమరావతిలో ఏపీ హైకోర్టు ఏర్పాటైంది. సంప్రదింపుల తర్వాతే ఏపీ హైకోర్టు అమరావతిలో ఏర్పాటు చేశారు. కర్నూలుకు హైకోర్టు తరలింపుపై ఏపీ సీఎం ప్రతిపాదించారు. మూడు రాజధానుల ప్రతిపాదనల్ని వ్యతిరేకిస్తూ.. హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. హైకోర్టు తరలింపుపై రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు అభిప్రాయాలు వెల్లడించాల్సింది ఉంది.'' అని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు లిఖితపూర్వక సమాధానాలు ఇచ్చారు.
అనంతరం రాజ్యాంగంలోని 214 నిబంధన, పునర్విభజన చట్టం 2014 ప్రకారం... అమరావతిలో ఏపీ హైకోర్టు ఏర్పాటైందని మంత్రి తెలిపారు. ఏపీ, తెలంగాణకు ఉమ్మడి హైకోర్టుగా ఉన్న అప్పటి హైదరాబాద్ హైకోర్టు.. నాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాతే విభజన చట్టం ప్రకారం.. ఏపీ హైకోర్టు అమరావతిలో ఏర్పాటైనట్లు కేంద్రం పేర్కొంది.