తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రైతులకు శుభవార్త.. ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధర పెంపు

Msp Price Increase : అన్నదాతలకు కేంద్రం శుభవార్త చెప్పింది. 2023-24 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి ఖరీఫ్ పంటలపై కనీస మద్దతు ధర పెంపునకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. సాధారణ వరి క్వింటాల్‌కు 143 రూపాయల మేర పెంచిన కేంద్రం.. ధర రూ.2,183గా నిర్ణయించింది. పెసలు కనీస మద్దతు ధరను 10.4 శాతం మేర పెంచి.. రూ. 8,558గా నిర్ణయించింది.

msp price increase
msp price increase

By

Published : Jun 7, 2023, 2:56 PM IST

Updated : Jun 7, 2023, 5:11 PM IST

Msp Price Increase : రైతులకు కేంద్ర గుడ్​న్యూస్ చెప్పింది. 2023-24 సంవత్సరానికి సంబంధించి ఖరీఫ్‌ పంటలకు కేంద్ర ప్రభుత్వం.. కనీస మద్దతు ధరలను బుధవారం పెంచింది. సాధారణ వరి క్వింటాల్‌కు 143 రూపాయల మేర పెంచిన కేంద్రం.. ధర రూ.2,183గా నిర్ణయించింది. ఈ మేరకు.. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ.. ఖరీఫ్ పంటలకు సంబంధించి కనీస మద్దతు ధరలను పెంచింది.

A గ్రేడ్‌ ధాన్యానికి కనీస మద్దతు ధరను 163 రూపాయల మేర పెంచిన కేంద్రం, ఆ గ్రేడ్ ధరను.. రూ. 2,203 రూపాయలుగా ఖరారు చేసింది. పెసలు కనీస మద్దతు ధరను 10.4 శాతం మేర పెంచి.. రూ. 8,558గా నిర్ణయించింది. ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరల పెంపు అన్నదాతలకు లాభయదాయకంగా ఉంటుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. అలాగే హరియాణా.. గురుగ్రామ్​లో 28.5 కిలోమీటర్ల మెట్రో కనెక్టివిటీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని గోయల్ వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్​కు రూ.5,452 కోట్లు కేటాయించిందని పేర్కొన్నారు.

  • వరి క్వింటాకు కనీస మద్దతు ధర రూ.143 పెరిగి.. రూ.2,183కు చేరింది.
  • A గ్రేడ్ ధాన్యానికి కేంద్రం రూ.163 ఎంఎస్​పీని కేంద్రం పెంచింది. దీంతో క్వింటా A గ్రేడ్ ధాన్యం ధర రూ.2,203కు చేరింది.
  • రాగి కనీస మద్దతు ధర రూ.268 పెంచింది కేంద్రం. దీంతో క్వింటా రాగి ధర రూ.3,846కు చేరింది.
  • సజ్జలు ఎంఆర్​పీ రూ.150 పెరిగి.. ధర రూ.2,500కు చేరింది.
  • హైబ్రిడ్‌ జొన్న క్వింటాల్‌ ధరను రూ.3180గా, జొన్న (మాల్దండి) ధరను రూ.3,225గా నిర్ణయించింది.
  • క్వింటా రాగి ధరను రూ.3,846గా, క్వింటా సజ్జలు ధరను రూ.2,500గా కేంద్రం నిర్ణయించింది.
  • మొక్కజొన్న రూ.2,090, పొద్దుతిరుగుడు (విత్తనాలు) రూ.6,760, వేరుశెనగ రూ.6,377గా ఉన్నాయి.
  • సోయాబీన్‌ రూ.4,600, పత్తి(మధ్యస్థాయి పింజ) రూ.6620, పత్తి (పొడవు పింజ) రూ. 7.020 చొప్పున 2023-24 సీజన్​లో ఇవ్వనున్నట్టు కేంద్రం తెలిపింది.

ప్రమాద బాధితులకు సంతాపం..
మణిపుర్ హింస, ఒడిశా రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారికి వారికి కేంద్ర మంత్రివర్గం సంతాపం తెలిపిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేసినట్లు ఆయన చెప్పారు. కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం పీయూష్ గోయల్ మీడియాతో మాట్లాడారు.

'ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర మంత్రివర్గ సభ్యులు ఒడిశా రైలు ప్రమాదం, మణిపుర్ హింసలో ప్రాణాలు కోల్పోయినవారికి సంతాపం తెలిపారు. బీఎస్​ఎన్​ఎల్ 4జీ, 5జీ స్పెక్ట్రమ్​ పునరుద్ధరణ ప్యాకేజీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. అందుకు రూ. 89,047 కోట్లు కేటాయించింది. బొగ్గు, లిగ్నైట్ అన్వేషణ కోసం 'ఎక్స్‌ప్లోరేషన్ ఆఫ్ కోల్ అండ్ లిగ్నైట్ స్కీమ్' కింద రూ.2,980 కోట్లు కేటాయించాం.'

--పీయూష్ గోయల్, కేంద్ర మంత్రి

Last Updated : Jun 7, 2023, 5:11 PM IST

ABOUT THE AUTHOR

...view details