Central Bank Jobs 2023 : ప్రభుత్వ బ్యాంకుల్లో ఉద్యోగం సాధించాలని ఎదురుచూస్తున్న వారికి శుభవార్త వినిపించింది సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Central Bank of India SO Recruitment 2023). తమ బ్యాంకుల్లోని స్పెషలిస్ట్ విభాగంలో ఖాళీగా ఉన్న మొత్తం 192 ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్ ద్వారా ఈ నియమకాలను చేపట్టనుంది సెంట్రల్ బ్యాంక్. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ పోస్టులు(Central Bank Of India Job Vacancy)..
- స్కేల్-I
- ఆఫీసర్ (స్పెషలిస్ట్ కేటగిరీ) : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- 15
- రిస్క్ మేనేజర్- 2
- సెక్యూరిటీ ఆఫీసర్- 15
- లైబ్రేరియన్- 1
- స్కేల్-II
- ఆఫీసర్ (స్పెషలిస్ట్ కేటగిరీ) : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- 73
- లా ఆఫీసర్- 15
- క్రెడిట్ ఆఫీసర్- 50
- ఫైనాన్సియల్ అనలిస్ట్- 4
- సీఏ- ఫైనాన్స్/అకౌంట్స్/జీఎస్టీ/ Ind AS/బ్యాలెన్స్ షీట్/ట్యాక్సేషన్- 3
- స్కేల్-III
- ఆఫీసర్ (స్పెషలిస్ట్ కేటగిరీ) : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- 6
- ఫైనాన్సియల్ అనలిస్ట్- 5
స్కేల్-IV
- ఆఫీసర్ (స్పెషలిస్ట్ కేటగిరీ) : రిస్క్‌మేనేజర్- 1
- స్కేల్-V
- ఆఫీసర్ (స్పెషలిస్ట్ కేటగిరీ) : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- 1
- రిస్క్ మేనేజర్- 1
విద్యార్హతలు(Central Bank Of India Jobs Eligibility)..
- ఇంజినీరింగ్, డేటా అనలిటిక్స్‌లో డిగ్రీ, ఎంబీఏ, ఎంబీఏ(ఫైనాన్స్), ఎంసీఏ, ఎమ్మెస్సీ(ఐటీ).. ఇలా పోస్టులను అనుసరించి విద్యార్హతలను నిర్ణయించారు.
- అలాగే సంబంధిత విభాగాల్లో గతంలో పనిచేసిన అనుభవం అభ్యర్థులకు తప్పనిసరిగా ఉండాలి.
వయో పరిమితి..
Central Bank Of India Jobs Age Limit :పోస్టులను అనుసరించి కనిష్ఠ వయస్సు 30 ఏళ్లు, గరిష్ఠ వయస్సు 45 ఏళ్లు.
వేతనాలు వివరాలు..
స్కేల్ I ఉద్యోగాలకు | రూ.36,000 నుంచి రూ.63,840 |
స్కేల్ II పోస్టులకు | రూ.48,170 నుంచి రూ.69,810 |
స్కేల్ III ఉద్యోగాలకు | రూ.63,840 నుంచి రూ.78,230 |
స్కేల్ IV పోస్టులకు | రూ.76,010 నుంచి రూ.89,890 |
స్కేల్ V ఉద్యోగాలకు | రూ.89,890 నుంచి రూ.1,00,350 |
దరఖాస్తు ఫీజు(Central Bank Of India Jobs Application Fees)..
- ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.175/-
- మిగతా కేటగిరీ అభ్యర్థులకు రూ.850/-