తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కొవిడ్ నిబంధనల మధ్య మహావీర్ జయంతి వేడుకలు' - భారత ఉపరాష్ట్రపతి

మహావీర్ జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కొవిడ్​-19 నిబంధనలు పాటిస్తూ ఇంట్లోనే వేడుకలు నిర్వహించుకోవాలని సూచించారు.

venkaiah naidu
వెంకయ్య నాయుడు

By

Published : Apr 25, 2021, 5:09 AM IST

Updated : Apr 25, 2021, 6:31 AM IST

ఏప్రిల్ 25, మహావీర్ జయంతి సందర్భంగా.. ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ప్రస్తుతం దేశంలో కరోనా కోరలు చాస్తున్న వేళ.. ప్రజలంతా కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఇంట్లోనే జయంతిని నిర్వహించుకోవాలని సూచించారు.

" లార్డ్ మహావీర్.. అహింసపై తాను చేసిన బోధనలతో మానవాళిలో ఐకమత్యం కోసం కృషి చేశారు. సామాజిక సంస్కరణలు, దేశ శాంతికోసం పాటుపడిన మహావీర్​.. దేశంలోనే ప్రముఖ మతగురువుల్లో ఒకరు."

-- వెంకయ్య నాయుడు, ఉపరాష్ట్రపతి

ఇదీ చదవండి :సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్​ శాంతన​గౌడర్ కన్నుమూత

Last Updated : Apr 25, 2021, 6:31 AM IST

ABOUT THE AUTHOR

...view details