CDS Chopper Crash: తమిళనాడు హెలికాప్టర్ ప్రమాదంలో భారత త్రిదళాధిపతి(సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ దుర్మరణం చెందిన ఘటనపై ట్రై సర్వీస్ విచారణ పూర్తయినట్లు సమాచారం. దర్యాప్తు బృందం ఈ నివేదికను వచ్చే వారం వైమానికదళ ప్రధాన కార్యాలయానికి సమర్పించనున్నట్లు తెలుస్తోంది.
ఎయిర్ మార్షల్ మన్వేంద్ర సింగ్లతో పాటు ఆర్మీ, నేవీలకు చెందిన ఒక్కొక్క బ్రిగేడియర్ ర్యాంక్ అధికారుల నేతృత్వంలో విచారణ బృందం.. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేసినట్లు పేర్కొన్నారు. విచారణ బృందం నిర్దేశించిన అన్ని నిబంధనలు, విధానాలను అనుసరించిందని నిర్ధరించడానికి చట్టపరమైన పరిశీలన జరుగుతోందని ఓ అధికారి తెలిపారు. అయితే దీనిపై ఎటువంటి అధికారిక సమాచారం వెలువడలేదు.