తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహంత్​ అనుమానాస్పద మృతిపై సీబీఐ దర్యాప్తు

అఖిల భారతీయ అఖాడా పరిషత్ అధ్యక్షుడు మహంత్ నరేంద్ర గిరి 'ఆత్మహత్య' కేసు (Narendra Giri) దర్యాప్తును సీబీఐకి బదిలీ చేసింది కేంద్రం. ఈ మేరకు ఐదుగురు సభ్యులతో కూడిన సీబీఐ బృందం ప్రయాగ్​రాజ్ చేరుకుని దర్యాప్తు ప్రారంభించింది.

narendra giri
మహంత్ నరేంద్ర గిరి

By

Published : Sep 24, 2021, 3:46 PM IST

ఉత్తర్​ప్రదేశ్‌లోని అఖిల భారతీయ అఖాడా పరిషత్‌ అధ్యక్షుడు మహంత్‌ నరేంద్రగిరి(Narendra Giri) మృతిపై.. సీబీఐ విచారణకు కేంద్రం ఆమోదం తెలిపింది. అతిపెద్ద సాధువుల పరిషత్‌కు నాయకత్వం వహిస్తున్ననరేంద్రగిరి(Mahant Narendra Giri).. అలహాబాద్‌లోని భాఘంబరి ఆశ్రమంలో సోమవారం(సెప్టెంబర్ 20) ఉరికి వేలాడుతూ కనిపించారు. ఆయన ఆత్మహత్యపై అనేక అనుమానాలు వ్యక్తం కావటం వల్ల.. ఉత్తర్​ప్రదేశ్‌ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి మేరకు సీబీఐ విచారణకు అనుమతిస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది.

ఈ మేరకు ఐదుగురు సభ్యులతో కూడిన సీబీఐ బృందం గురువారం మధ్యాహ్నం ప్రయాగ్​రాజ్​ చేరుకుని మహంత్​(Narendra Giri News) ఆత్మహత్య కేసుపై దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిసింది. సీబీఐ అధికారులతో పాటు సిట్ అధికారులు, ప్రయాగ్​రాజ్​ ఉన్నత పోలీసు అధికారులు ఉన్నట్లు సమాచారం.

అయితే.. నరేంద్ర గిరి మరణం ఆత్మహత్యగా భావించిన పోలీసులు.. ఘటనాస్థలం నుంచి సూసైడ్​ నోట్​ను స్వాధీనం చేసుకున్నారు. ఆనంద్​ గిరి తనను మానసికంగా వేధించాడని నరేంద్ర గిరి లేఖలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆనంద్​ గిరి సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్​ చేశారు. అయితే.. ఈ ఆత్మహత్య లేఖ నరేంద్ర గిరి రాసింది కాదని పలువురు ఆరోపిస్తున్నారు. మహంత్​ నిర్ణయాలను వ్యతిరేకించే వాళ్లే హత్యకు పాల్పడి ఉంటారని చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details