అవినీతి ఆరోపణల కేసులో మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌కు సీబీఐ సమన్లు జారీ చేసింది. ఏప్రిల్ 14న తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది.
ముంబయి మాజీ సీపీ పరంబీర్ సింగ్ చేసిన ఆరోపణలపై సీబీఐ విచారణ చేస్తోంది. నెలకు రూ. 100 కోట్లు వసూలు చేయాలంటూ పోలీసులకు దేశ్‌ముఖ్ ఆదేశాలు ఇచ్చారని పరంబీర్ ఆరోపణలు చేశారు. బార్లు, రెస్టారెంట్ల నుంచి డబ్బులు వసూలు చేయాలని సూచించినట్లు చెప్పారు.