రోజ్ వ్యాలీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ కుందు భార్య సుభ్ర కుందును కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అరెస్ట్ చేసింది. పోంజీ కుంభకోణంలో ఆమె పాత్రపై సీబీఐ లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
పోంజీ స్కాం: రోజ్ వ్యాలీ ఛైర్మన్ భార్య అరెస్ట్ - పోంజీ స్కాంలో సుభ్ర కుందు అరెస్ట్
పోంజీ కుంభకోణం కేసులో సీబీఐ మరొక కీలక వ్యక్తిని అరెస్ట్ చేసింది. రోజ్ వ్యాలీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ కుందు భార్యను ఈ కేసు విషయంలో విచారించేందుకు అదుపులోకి తీసుకుంది.
పోంజీ స్కాం: రోజ్ వ్యాలీ ఛైర్మన్ భార్య అరెస్ట్
ఈ కేసులో ఆమెను విచారించేందుకు సీబీఐ సహా ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ సిద్ధంగా ఉంది. రోజ్ వ్యాలీ గ్రూప్.. చట్టవిరుద్ధమైన స్కీమ్లతో ఆశ చూపి వేలాదిమంది డిపాజిటర్లను మోసం చేసింది. ఈ కుంభకోణం విలువ రూ.12 వేల కోట్లపైమాటే అని సీబీఐ వర్గాలు అంటున్నాయి.
ఈ కేసులో ఆమె భర్త గౌతమ్ కుందు 2015 మార్చి నుంచి జైలులోనే ఉన్నారు. రోజ్ వ్యాలీ సంస్థ దేశవ్యాప్తంగా పలు హోటళ్లు, రిసార్ట్లలో భారీ పెట్టుబడులు పెట్టింది.