తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అమ్మకానికి గవర్నర్​ పదవి, రాజ్యసభ సీటు!'.. రూ.100కోట్ల స్కామ్ బట్టబయలు - సీబీఐ అరెస్ట్

రాజ్యసభ సభ్యత్వం, గవర్నర్​, ఛైర్మన్​ పోస్టులు ఇప్పిస్తామంటూ ప్రజలను మోసం చేస్తున్న ముఠాను కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) అరెస్ట్ చేసింది. రూ. 100కోట్ల మేర మోసం చేసిన నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సీబీఐ తెలిపింది.

cbi arrests news
cbi arrests news

By

Published : Jul 25, 2022, 3:08 PM IST

Updated : Jul 25, 2022, 6:23 PM IST

పదవుల ఆశచూపి ప్రజలను మోసం చేస్తున్న ఓ ముఠాను కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) పట్టుకుంది. రాజ్యసభ సభ్యత్వం, గవర్నర్​ పదవి, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ సంస్థలకు ఛైర్మన్​గా స్థానం ఇప్పిస్తామంటూ.. రూ. 100కోట్ల మేర మోసం చేసిన నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు సీబీఐ తెలిపింది. వీరిని కమలాకర్​ ప్రేమ్​కుమార్​, అభిషేక్​ బూర, మహ్మద్​ అజీజ్ ఖాన్​, రవీంద్ర విఠల్​ నాయక్​గా గుర్తించింది. మరో నిందితుడు పరారీలో ఉన్నారని చెప్పింది. దిల్లీ, ఉత్తర్​ప్రదేశ్​, మహారాష్ట్ర, కర్ణాటక సహా ఏడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.

కమలాకర్​ ప్రేమ్​కుమార్​.. సీబీఐ ప్రధాన కార్యాలయంలో అధికారినంటూ ప్రజలను మోసం చేస్తున్నాడని ఎఫ్ఐఆర్​లో తెలిపింది. రాజ్యసభ సభ్యత్వం, గవర్నర్​ పదవి, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ సంస్థలకు ఛైర్మన్​గా స్థానం ఇప్పిస్తానని చెప్పేవాడని పేర్కొంది. కమలాకర్​ మరో ముగ్గురు నిందితులు కలిసి ఇప్పటి వరకు సుమారు రూ.100కోట్ల మోసం చేశారని వివరించింది. సీనియర్​ అధికారులు, రాజకీయ నేతల పేర్లు వాడుకుంటూ ప్రజలు, పోలీసులను మోసం చేశాడని సీబీఐ వెల్లడించింది. అయితే, నలుగురు నిందితులకు బెయిల్​ మంజూరు చేసింది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం.

Last Updated : Jul 25, 2022, 6:23 PM IST

ABOUT THE AUTHOR

...view details