తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కుమారుడితో ఆడుకుంటూ.. అలల్లో కొట్టుకుపోయిన తండ్రి - father swept away in sea puri

Man Swept Away In Sea: ఒడిశాలోని పూరీలో విషాదం చోటు చేసుకుంది. కుమారుడితో కలిసి సముద్ర తీరంలో సరదాగా గడుపుతుండగా ఓ వ్యక్తి గల్లంతయ్యాడు.

caught-on-camera-man-washed-away-by-waves-in-sea
caught-on-camera-man-washed-away

By

Published : Apr 17, 2022, 7:32 AM IST

Updated : Apr 17, 2022, 9:53 AM IST

Man Swept Away In Sea: కుమారుడితో కలిసి సముద్రతీరంలో సరదాగా గడుపుతుండగా.. అలల తాకిడికి ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు. ఈ విషాదకర ఘటన ఒడిశాలోని పూరీలో జరిగింది. దీనికి సంబంధించిన దృశ్యాలు అతడి బంధువు మొబైల్​ ఫోన్​లో రికార్డు అయ్యాయి. దీంతో ఆ వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది. బాలాసోర్​కు చెందిన బన్సీధర్​ బెహర తన కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రకు పూరీకి వచ్చారు. కొడుకుతో కలిసి సముద్ర తీరానికి వచ్చిన బన్సీధర్​.. అలల తాకిడికి గల్లంతయ్యాడు. ఈ ఘటనలో మొత్తం ముగ్గురు గల్లంతుకాగా.. ఇద్దరిని లైఫ్​గార్డులు రక్షించారు. ​

అలల తాకిడికి కొట్టుకుపోయిన వ్యక్తి
లైఫ్​గార్డులు
Last Updated : Apr 17, 2022, 9:53 AM IST

ABOUT THE AUTHOR

...view details