తెలంగాణ

telangana

By

Published : Jun 30, 2021, 6:06 PM IST

ETV Bharat / bharat

ఊరూరా వైఫై- కేంద్రం కీలక నిర్ణయం

భారత్​నెట్​ పథకానికి రూ.19,041కోట్లు కేటాయించేందుకు కేంద్ర మంత్రివర్గం అంగీకారం తెలిపింది. ఆర్ధిక రంగానికి ఊతమిచ్చేలా కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్​ ప్రకటించిన రూ.6.28 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీని ఆమోదించింది.

BharatNet
భారత్​నెట్​ పథకం

భారత్‌నెట్‌ అమలుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రభుత్వ- ప్రైవేట్​ భాగస్వామ్యం​(పీపీపీ) విధానంలో 16 రాష్ట్రాల్లో భారత్‌నెట్‌ పథకం అమలు చేయనుంది. ఇందుకుగాను రూ.19,041 కోట్లు కేటాయించినట్లు కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్​ ప్రసాద్​ తెలిపారు.

16 రాష్ట్రాల్లో 3 లక్షల 60 వేల గ్రామాల్లో దాదాపు రూ.29,430 కోట్లు ఖర్చుచేయనున్నట్లు కేంద్ర మంత్రి రవిశంకర్​ చెప్పారు. ప్రస్తుతం కేటాయించిన రూ. 19,041 కోట్లను విడతలవారీగా అందించనున్నట్లు పేర్కొన్నారు. దేశంలో ఆరు లక్షల గ్రామాల్లో బ్రాండ్​ బ్యాండ్ సౌకర్యం అందించాలని గత ఏడాది ఆగస్టులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన అనంతరం ప్రైవేట్​కు కూడా అనుమతి ఇచ్చినట్లు తెలిపారు.

దేశంలో ఇప్పటివరకు 1.56 లక్షల గ్రామాలకు బ్రాడ్​ బ్యాండ్ సౌకర్యం అందించినట్లు పేర్కొన్నారు రవిశంకర్.

ప్యాకేజీకి ఆమోదం..

కొవిడ్​తో కుదేలైన ఆర్థిక రంగానికి ఊతమిచ్చేలా కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్​ ప్రకటించిన రూ.6.28 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీకి కేంద్ర కేబినెట్​ ఆమోదం తెలిపింది. ఉత్పత్తిని, ఎగుమతుల్ని, ఉపాధి అవకాశాల్ని పెంచే రీతిలో ఆరోగ్యం, సామాజిక, ఆర్థిక రంగాలకు ఊతమిచ్చేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రూ.6,28,993 కోట్ల ప్యాకేజీ ప్రకటించారు. ఇందులో రూ. 1.5లక్షల కోట్లు చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం కేటాయించారు. ఆరోగ్య రంగం, పర్యటకానికి పెద్ద పీఠ వేశారు.

ఇవీ చదవండి:వత్తీచమురూ లేని ఉద్దీపన ప్యాకేజీ

ప్రైవేటు టీకా కేంద్రాలకు జులై 1 నుంచి కొత్త రూల్స్​!

ABOUT THE AUTHOR

...view details