గరీభ్ కల్యాణ్ యోజన కింద నవంబర్ వరకు ఉచిత రేషన్ పంపిణీ ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. దీనితో దాదాపు 80 కోట్ల మందికి మరో ఐదు నెలల పాటు ఉచితంగా రేషన్ అందనుంది. వచ్చే దివాళీ వరకు పేదలకు ఉచిత రేషన్ అందించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ గత నెలలోనే ప్రకటించారు.
కరోనా మహమ్మారి పరిస్థితుల్లో పేదలు ఇబ్బంది పడకుండా ఉచిత రేషన్ సౌలభ్యాన్ని పొడిగించటం వరుసగా ఇది నాలుగోసారి. ప్రతి వ్యక్తికి 5 కేజీల ఆహార ధాన్యాన్ని ఇవ్వనున్నారు. ఐదు నెలలకుగాను సుమారు 204 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను పంపిణీ చేయనున్నారు.