తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'సీఏఏ నిరసనలు, లాక్​డౌన్​ ఉల్లంఘనల కేసులు ఎత్తివేత'

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనల్లో పాల్గొన్నవారిపై నమోదైన కేసులను రద్దు చేయనున్నట్టు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. అదే సమయంలో కరోనా లాక్​డౌన్​ కాలంలో నమోదైన 10లక్షల కేసులనూ ఎత్తేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

CAA protest cases dropped: TN CM Edappadi K Palaniswami
'పౌరసత్వ చట్ట నిరసనకారులపై కేసులు ఎత్తివేత'

By

Published : Feb 19, 2021, 10:46 PM IST

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనల్లో పాల్గొన్నవారిపై నమోదైన కేసులు ఎత్తివేయనున్నట్టు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రకటించారు. అదేసమయంలో.. కరోనా లాక్​డౌన్​ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి దాదాపు 10లక్షల కేసులు ఎత్తివేయనున్నట్టు తెలిపారు. లాక్​డౌన్​ సమయంలో పోలీసు విధులకు ఆటంకం కలిగించడంతో పాటు అక్రమ మార్గంలో ఈ-పాస్​ పొందిన కేసులు మినహా మిగతావాటిని ఎత్తివేయనున్నట్టు పళనిస్వామి వివరించారు. కడయనల్లూరులోని ఎన్నికల ప్రచార సభలో ఈ మేరకు ప్రస్తావించారు.

సీఏఏ కేసులు రద్దు..

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళనల్లో ప్రజా ఆస్తుల ధ్వంసం, నిబంధనల ఉల్లంఘన, పోలీసు విధులకు ఆటంకం కలిగించారన్న అభియోగాలపై దాదాపు 1500 మందిపై కేసులు నమోదయ్యాయి. లాక్​డౌన్​ నిబంధనల ఉల్లంఘన సహా.. కరోనా వ్యాధిపై అసత్య వార్తలను ప్రచారం చేసిన వారిపై అప్పట్లో పోలీసులు కేసులు నమోదు చేశారు.

10లక్షల మందికి విముక్తి..

తాము తీసుకున్న ఈ నిర్ణయంతో.. సుమారు 10లక్షల మందికి కేసుల నుంచి విముక్తి కలుగనుందన్నారు పళనిస్వామి. హింసకు సంబంధించిన కేసులు తప్ప ఇతర కేసుల్లో ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఉద్ఘాటించారు. కూడంకుళం అణు విద్యుత్ ప్రాజెక్టును వ్యతిరేకించిన వారిపై నమోదైన అనేక కేసులను సైతం ఉపసంహరించామని గుర్తుచేశారు.

ఇవీ చదవండి:'చిన్నమ్మ వస్తే తమిళనాడులో అల్లర్లే'

చిన్నమ్మ దారెటు? పార్టీపై పెత్తనం సాధ్యమా?

అన్నాడీఎంకే 'మౌనం'- ఏకాకిగా విజయకాంత్!

మంచి ప్రభుత్వానికి ఆ పట్టింపులు ఉండవు: మోదీ

ABOUT THE AUTHOR

...view details