ఉత్తరాఖండ్, ఉత్తరకాశీ జిల్లాలోని డామ్టా ప్రాంతంలో ఘోర ప్రమాదం జరిగింది. యమునోత్రి రహదారిపై 28 మంది యాత్రికులతో వెళ్తున్న ఓ బస్సు 200 మీటర్ల లోతు లోయలో పడిపోయింది. ఈ దుర్ఘటనలో మొత్తం 25 మంది ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
లోయలోకి దూసుకెళ్లిన యాత్రికుల బస్సు.. 25 మంది మృతి - tourists bus accident in uttarkashi
यमुनोत्री हाईवे पर डामटा के पास एक यात्रियों से भरी बस करीब 200 मीटर गहरी खाई में जा गिरी. बताया जा रहा है कि बस में करीब 30 लोग सवार थे.
20:12 June 05
28 మంది యాత్రికులతో లోయలోకి దూసుకెళ్లిన బస్సు
సమాచారం అందుకున్న పోలీసులు, రాష్ట్ర విపత్తు స్పందన దళం బృందాలు సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. యాత్రికులంతా మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాకు చెందినవారిగా పోలీసులు తెలిపారు. వారంతా యమునోత్రికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు చెప్పారు. 25 మృతదేహాలను వెలికితీసినట్లు తెలిపారు. లోయలో పడిన తర్వాత బస్సు రెండు భాగాలుగా విడిపోయినట్లు చెప్పారు. సంఘటనాస్థలానికి డాక్టర్ల బృందంతో పాటు అంబులెన్స్‌లు తరలించాలని జిల్లా పాలనాధికారి అభిశేక్ రుహేలా ఆదేశించారు. క్షతగాత్రులను డామ్టా, నౌగావ్‌లోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు తరలించామన్నారు.
సీఎం దిగ్భ్రాంతి:యమునోత్రికి వెళ్తూ బస్సు లోయలోపడిన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. ఉత్తరాఖండ్ ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటున్నట్లు చెప్పారు. క్షతగాత్రులకు సరైన వైద్యంతో పాటు మృతదేహాలను స్వదేశానికి తరలించేందుకు అన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మరోవైపు.. ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్‌సింగ్ ధామీకి ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు.
రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటన:ఉత్తరకాశీలో జరిగిన బస్సు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. మృతులు కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50వేలు పరిహారం ప్రకటించారు.