బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(BSF).. పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. హెడ్ కానిస్టేబుల్ ఖాళీల భర్తీకి బీఎస్‌ఎఫ్ ప్రస్తుతం ఆసక్తికర అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఏప్రిల్ 22న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుండగా.. మే 12 వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 247 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. ఇందులో వివిధ విభాగాల పోస్టులు ఉన్నాయి. హెచ్‌సీ రేడియో ఆపరేషన్(ఆర్‌ఓ), హెచ్‌సీ రేడియో మెకానిక్స్(RM) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ డైరెక్టరేట్, డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కలిపి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ 2023 పేరిట తాజాగా ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేశాయి. హెచ్‌సీ రేడియో ఆపరేషన్స్(ఆర్‌ఓ) పోస్టులు 217 ఉండగా.. హెచ్‌సీ రేడియో మెకానిక్స్(ఆర్‌ఎం) పోస్టులు 30 ఉన్నాయి.
విద్యార్హతలు..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఇంటర్మీడియట్ (MPC) పూర్తి చేసి ఉండాలి. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులలో కనీసం 60 శాతం మార్కులు వచ్చి ఉండాలి. లేదా టెన్త్ క్లాస్‌తో పాటు రెండు సంవత్సరాల ఇండస్ట్రీయల్ ట్రైనింగ్‌లో సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికేట్ ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని బీఎస్‌ఎఫ్ తన నోటిఫికేషన్‌లో పేర్కొంది.
ఫీజు వివరాలు..
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూసీ కేటగిరీల అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ఇక మహిళలు, ఎస్సీ,ఎస్టీ, ప్రస్తుతం మిలటరీలో పనిచేస్తున్న వారికి ఎలాంటి దరఖాస్తు ఫీజు ఉండదు. వీరంతా ఉచితంగానే అప్లై చేసుకోవచ్చు.