ఒడిశాలో భద్రతా సిబ్బంది లక్ష్యంగా దాడికి పాల్పడాలనుకున్న మావోయిస్టుల కుట్ర భగ్నమైంది. మల్కాన్గిరి జిల్లా జోదమాబా పోలీస్ స్టేషన్ పరిధిలోని కడాలిబంద అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించిన బీఎస్ఎఫ్ జవాన్లు.. భారీ ఎత్తున పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. దీంతో పెను ప్రమాదం తప్పినట్లైంది.
భద్రతా సిబ్బందిపై మావోయిస్టుల దాడి కుట్ర భగ్నం - బీఎస్ఎఫ్ జవాను టిఫిన్ బాంబులు
అటవీ ప్రాంతంలో భద్రతా సిబ్బంది లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన పేలుడు పదార్థాలను బీఎస్ఎఫ్ జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. ఐదు కిలోల టిఫిన్ బాంబు, రెండు ఐఈడీలను గుర్తించి.. నిర్వీర్యం చేశారు.
భద్రతా సిబ్బందిపై మావోయిస్టుల దాడి కుట్ర భగ్నం
ఐదు కిలోల టిఫిన్ బాంబు, రెండు ఐఈడీలు, వైర్లు, బ్యాటరీలతో పాటు ఓ మావోయిస్టు యూనిఫాంను భద్రతా సిబ్బంది రికవరీ చేసుకున్నారు. అనంతరం టిఫిన్ బాంబులు, ఐఈడీలను నిర్వీర్యం చేశారు.
ఇదీ చదవండి:ఈ బ్యూటీ పార్లర్- గేదెలకు మాత్రమే