రాజస్థాన్‌లోని జైపూర్‌లో శనివారం ఓ సరిహద్దు భద్రతా దళ(బీఎస్ఎఫ్) సిబ్బంది ఆత్మహత్య చేసుకున్నాడు. జైసల్మేర్ క్యాంపస్‌లో ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. 46వ బెటాలియన్‌కు చెందిన నరేంద్ర కుమార్ వర్మగా పోలీసులు గుర్తించారు.
బీఎస్ఎఫ్ జవాను ఆత్మహత్య - సరిహద్దు భద్రతా దళం
రాజస్థాన్‌లో ఓ బీఎస్ఎఫ్ జవాను బలవన్మరణం చెందాడు. కుటుంబ కలహాలే అందుకు కారణంగా తెలుస్తోంది.
BSF jawan posted in Jaisalmer committed suicide by hanging himself
కొద్దిరోజుల క్రితమే నరేంద్ర కుమార్ ఇంటికి సెలవుపై వెళ్లి డిసెంబర్ 9న తిరిగొచ్చినట్లు తెలుస్తోంది. కుటుంబ కలహాల కారణంగానే ఆత్మహత్య చేసుకొని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. వర్మ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం భౌతికదేహాన్ని బీఎస్ఎఫ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.