తెలంగాణ

telangana

ETV Bharat / bharat

Brother Sister Temple Bihar : 'అన్నాచెల్లెళ్ల ఆలయం'.. భక్తుల వినూత్న పూజలు.. 'రాఖీ'రోజు మాత్రమే దర్శనం! - women tie rakhi lord vishnu

brother sister temple bihar : రాఖీ పండగ అంటే అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు చేసుకునే పండగ. అయితే బిహార్​లో మాత్రం ఆలయం, ఆ పరిసరాల్లో ఉన్న మర్రిచెట్టును సోదరసోదరీమణులుగా భావిస్తూ పూజలు చేస్తున్నారు. తమ సోదరుడికి దీర్ఘాయుష్షు ప్రసాదించాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నారు. మరోవైపు, ఉత్తరాఖండ్​లో ఓ ఆలయాన్ని రాఖీ పండగ రోజు మాత్రమే తెరుస్తున్నారు. ఆ ఆలయాల విశేషాలు తెలుసుకుందామా?

brother sister temple bihar
brother sister temple bihar

By ETV Bharat Telugu Team

Published : Aug 31, 2023, 12:45 PM IST

brother sister temple bihar : రాఖీ అంటే రక్షణనిచ్చే బంధం. సోదరుడు సుఖంగా ఉండాలని సోదరి రక్షాబంధనాన్ని కడుతుంది. సోదరికి జీవితాంతం రక్షగా ఉంటానని సోదరుడు అండగా నిలబడతాడు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల ప్రేమానురాగాలకు చిహ్నం రక్షాబంధన్​. అయితే బిహార్.. సివాన్​లోని దరోండా బ్లాక్​లో 'భాయీ​-బెహన్​ ఆలయం' ఉంది. ఈ ఆలయంలో రాఖీ పండుగను వినూత్నంగా జరుపుకుంటారు స్థానికులు. ఆలయం, దాని ఆవరణలో ఉన్న మర్రి చెట్లను అన్నాచెల్లెళ్లుగా భావిస్తారు. వీటినే రాఖీ పండగ రోజు దేవతలుగా కొలుస్తారు. ఈ ఆలయంలో దేవుళ్ల ప్రతిమలు ఉండవు. ఒక మట్టి దిబ్బ మాత్రమే ఉంటుంది. దానినే దేవుడిగా భావించి భక్తులు పూజలు చేస్తారు.

భాయీ​-బెహన్​ ఆలయం
గ్రామస్థులు

రాఖీ పండగ రోజు.. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు దేవాలయం, మర్రి చెట్లు వద్ద పూజలు చేస్తారు. తమ సోదరుడికి దీర్ఘాయుష్షు ప్రసాదించాలని దేవుడ్ని ప్రార్థిస్తారు. ఆపై సోదరుడు తన సోదరిని ఎల్లవేళలా రక్షిస్తానని ప్రమాణం చేస్తాడు. ఇద్దరు సోదరసోదరీమణుల గౌరవాన్ని కాపాడటానికి.. దేవుడే ఇక్కడ ప్రత్యక్షమయ్యాడని స్థానికులు నమ్ముతున్నారు. అప్పటి నుంచి రక్షాబంధన్ వేడుకలు 'భాయీ​-బెహన్​ ఆలయం'లో చేసుకుంటున్నారు. అన్నాచెల్లెళ్లను, అక్కాతమ్ముళ్లను రక్షించాడని దేవుడే 500 ఏళ్ల క్రితం భూమిపైకి వచ్చాడని అక్కడి స్థానిక ప్రజల నమ్మకం.

భాయీ​-బెహన్​ ఆలయం
ఆలయ ఆవరణలో మర్రిచెట్లు

"బ్రిటిష్ పాలనలో.. ఓ వ్యక్తి, అతడి చెల్లిపై దోపిడీ దొంగలు దాడికి ప్రయత్నించారు. వారు దొంగల నుంచి కాపాడమని దేవుడ్ని ప్రార్థించారు. ఆ పిలుపు విని దేవుడు ప్రత్యక్షమై.. భూమి పగిలేటట్లు చేశాడు. అందులో వారిద్దరినీ సమాధి చేశాడు. అప్పుటి నుంచి వీరిద్దరూ ప్రజల కలలో కనిపించేవారు. అందుకే ఆ ప్రాంతంలో గ్రామస్థులు దేవాలయాన్ని నిర్మించారు."
--ఉమాపతి దేవి, గ్రామస్థురాలు

విష్ణుమూర్తికి రాఖీ కట్టిన మహిళలు..
Women Tie Rakhi Lord Vishnu : మరోవైపు, ఉత్తరాఖండ్​.. చమోలీలోని బన్షి నారాయణ్​ ఆలయాన్ని రక్షాబంధన్ రోజు మాత్రమే తెరుస్తారు. ఈ దేవాలయం ఏడాదంతా మూసి ఉంటుంది. సముద్ర మట్టానికి బన్షి నారాయణ్ దేవాలయం దాదాపు 13 వేల అడుగుల ఎత్తులో ఉంటుంది. రక్షాబంధన్ రోజు బన్షి నారాయణ్ దేవాలయానికి భారీగా భక్తులు తరలివస్తుంటారు. ఈసారీ భారీగా భక్తులు ఇక్కడికి విచ్చేశారు. విష్ణుమూర్తికి రాఖీలు కట్టారు. పండగ నేపథ్యంలో వివిధ పూలతో ఆలయ ప్రాంగణాన్ని అందంగా అలంకరించారు.

బన్షి నారాయణ్ ఆలయం

Rakhi For Soldiers : సైనికులకు 27 అడుగుల స్పెషల్​ రాఖీ.. 21 మంది వీరజవాన్ల చిత్రాలతో..

Raksha Bandhan Wishes and Quotes in Telugu: మీ ఆత్మీయులకు శుభాకాంక్షలు చెప్పండిలా.. రాఖీ విషెస్​ & స్పెషల్ కోట్స్​

Sister Kidney Donation to Brother : అన్నకు కిడ్నీ ఇచ్చిన చెల్లి.. సోదరుడికి నిజమైన రక్షాబంధన్ కానుక!

ABOUT THE AUTHOR

...view details