తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బ్యాక్ పోల్ రైడింగ్‌లో జవాన్ ప్రపంచ​ రికార్డ్​.. 174 కి.మీ దూరం ఐదున్నర గంటల్లోనే పూర్తి!

దిల్లీ బీఎస్​ఎఫ్​ క్యాంపులో జరిగిన బ్యాక్ పోల్ రైడింగ్‌ పోటీల్లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జట్టు ప్రపంచ రికార్డు సృష్టించింది. జట్టు కెప్టెన్​ అవధేశ్ కుమార్ సింగ్ రాయల్ ఎన్​ఫీల్డ్ బైక్​ మీద 12 అడుగుల 10 ఇంచుల స్తంభంపై నిలబడి 5 గంటల 26 సమయంలోనే 174.1 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేశారు.

bsf won world record
అవధేశ్ కుమార్ సింగ్

By

Published : Dec 23, 2022, 2:03 PM IST

Updated : Dec 23, 2022, 2:17 PM IST

అవధేశ్ కుమార్ సింగ్

బ్యాక్ పోల్ రైడింగ్‌లో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మరోసారి ప్రపంచ రికార్డును సృష్టించింది. దిల్లీ ఛావ్లాలోని బీఎస్​ఎఫ్​ క్యాంపులో జరిగిన ఈ పోటీల్లో.. 174.1 కిలోమీటర్ల దూరాన్ని 5 గంటల 26నిమిషాల్లో పూర్తిచేశారు బీఎస్​ఎఫ్​ జట్టు కెప్టెన్​ అవధేశ్​ కుమార్. అంతకుముందు 128 కిలోమీటర్ల దూరాన్ని 4 గంటల 29 నిమిషాల్లో రైడింగ్ చేసి భారత సైన్యం రికార్డు సృష్టించింది. ఈ రికార్డును బద్దలు కొట్టారు బీఎస్ఎఫ్ వీర జట్టు కెప్టెన్ అవధేశ్ కుమార్ సింగ్.

విజయ్‌ దివాస్‌ సందర్భంగా బ్యాక్‌ పోల్‌ రైడింగ్‌ పోటీలు నిర్వహించగా.. బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌) జట్టు ప్రపంచ రికార్డు సృష్టించింది. బీఎస్‌ఎఫ్‌ వీర జట్టు కెప్టెన్ ఇన్‌స్పెక్టర్ అవధేశ్ కుమార్ సింగ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ 350 సిసి బైక్​పై ఉన్న 12 అడుగుల 10 అంగుళాల స్తంభంపై నిలబడి.. 5 గంటలు 26నిమిషాల సమయంలో నిరంతరాయంగా 174.1 కిలోమీటర్ల దూరం నడిపి ప్రపంచ రికార్డు సృష్టించారు. అంతకుముందు 2018లో కూడా ఈ విధంగా 2 గంటల 10 నిమిషాలు నడిపి భారత్​ విజయం సాధించింది.

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ ఐపిఎస్ పంకజ్ కుమార్ సింగ్ ప్రోత్సాహకంతోనే.. తమ జట్టు ప్రపంచ రికార్డును సాధించగలిగిందని కెప్టెన్ ఇన్‌స్పెక్టర్ అవధేశ్ కుమార్ సింగ్ తెలిపారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్‌కు చెందిన వీర మోటార్‌ సైకిల్ టీమ్ పేరిట ఇప్పటివరకు మొత్తం 20 ప్రపంచ రికార్డులు ఉన్నాయి.

Last Updated : Dec 23, 2022, 2:17 PM IST

ABOUT THE AUTHOR

...view details