జమ్ము కశ్మీర్ హైదర్‌పొరా ఎన్కౌంటర్లో(Hyderpora encounter news) ఉగ్రవాదులతో పాటు మృతిచెందిన అల్తాఫ్ భట్, ముదాసిర్ గుల్.. మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. సూర్యాస్తమయం తర్వాత శవాలను వెలికితీసిన పోలీసులు గురువారం రాత్రి.. వాటిని సంబంధిత కుటుంబసభ్యులకు అందించారు.
కొవిడ్-19 మహమ్మారి తర్వాత.. ఖననం చేసిన మృతదేహాలను వెలికితీయటం ఇది మొదటిసారని.. అధికారులు తెలిపారు. పోలీసు బృందం ఆధ్వర్యంలో శవాలను హంద్వారా నుంచి శ్రీనగర్‌కు తరలించారు.
ఏం జరిగిందంటే?
సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో(Hyderpora encounter news) ఓ పాకిస్థాన్ ఉగ్రవాదితో పాటు అతడి అనుచరుడు మహమ్మద్ ఆమిర్‌ను బలగాలు హతమార్చాయి. వారితో పాటు ఉన్న అల్తాఫ్ భట్, ముదాసిర్ గుల్ సైతం ఎదురుకాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. వీరంతా హైదర్‌పొరాలో ఓ అక్రమ కాల్‌సెంటర్, ఉగ్ర శిబిరాన్ని నిర్వహిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు.
అల్తాఫ్, ముదాసిర్ కుటుంబ సభ్యులు మాత్రం ఈ వాదనను వ్యతిరేకిస్తున్నారు. వారిద్దరూ అమాయకులని అంటున్నారు. తమ కుటుంబ సభ్యుల మృతదేహాలను అప్పగించాలని డిమాండ్ చేశారు.
అయితే, శాంతి భద్రతల సమస్యను దృష్టిలో ఉంచుకొని ఎన్కౌంటర్లో మరణించిన నలుగురికి కుప్వారా జిల్లాలోని హంద్వారా ప్రాంతంలో అంత్యక్రియలు నిర్వహించినట్లు పోలీసులు స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:హైదర్‌పొరా ఎన్‌కౌంటర్‌పై కశ్మీర్లో రగడ- ఆ జిల్లాలో ఆంక్షలు