తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గోల్డెన్​ టెంపుల్​ వద్ద భారీ పేలుడు.. అనేక మందికి గాయాలు.. - స్వర్ణ దేవాలయంలో భారీ పేలుడు తాజా వార్తలు

పంజాబ్​ అమృత్‌సర్‌లోని గోల్డెన్​ టెంపుల్​ సమీపంలో శనివారం రాత్రి అకస్మాత్తుగా ఓ భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి కొందరికి స్వల్ప గాయాలయ్యాయి.

Punjab Amritsar Golden Temple Blast Several Injured
గోల్డెన్​ టెంపుల్​ దగ్గర భారీ పేలుడు అనేక మందికి గాయాలు

By

Published : May 7, 2023, 1:00 PM IST

పంజాబ్‌ అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం సమీపంలోని దర్బార్ సాహిబ్ దగ్గర శనివారం రాత్రి అకస్మాత్తుగా జరిగిన ఓ పేలుడులో కొందరు బాలికలు సహా పలువురు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు పేలుడు జరిగిన ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో స్థానికులకు ఒక్కసారిగా పేలుడు శబ్దం వినిపించడం వల్ల భయాందోళనకు గురయ్యారు. కొన్ని రాళ్లు, గాజు ముక్కలు వచ్చి తమపై పడ్డాయని కొందరు యాత్రికులు వచ్చారని చెబుతున్నారు. ఈ పేలుడు కారణంగా పార్కింగ్​ ఏరియాలో ఉన్న పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయని ఓ పోలీసు అధికారి తెలిపారు. అయితే, స్వర్ణ దేవాలయంలో బాంబు పేలుడు అంటూ వస్తున్న వార్తలను పోలీసులు ఖండించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పంజాబ్​ పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

"ఇది బాంబు పేలుడు కాదు. సచ్‌ఖండ్ శ్రీ హర్మందిర్ దర్బార్​ సాహిబ్ బయట ఉన్న పార్కింగ్ స్థలంలో భారీ గాజు వస్తువు పేలింది. అలాగే పార్కింగ్ ఏరియా పక్కనే ఓ రెస్టారెంట్ ఉంది. ఆ హోటల్​ చిమ్నీ చాలా వేడిగా ఉండడం కారణంగా అందులో గ్యాస్​ ఏర్పడి అక్కడే ఉన్న గాజు అద్దం పగిలి పేలుడు సంభవించింది. పేలుడు జరిగిన వెంటనే మంటలు చెలరేగి పొగలు వ్యాపించాయి. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు."
- పోలీసు అధికారి

అర్ధరాత్రి పేలుళ్లు.. భయంతో పరుగులు!
బండరాళ్లను తొలగించేందుకు ఓ నిర్మాణ సంస్థ పేలుళ్లు జరపడం వల్ల స్థానికుల ఇళ్లు ధ్వంసమైన ఘటన రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్‌లోని కృష్ణనగర్‌ కాలనీలో జరిగింది. ఏప్రిల్​ 8న రాత్రి 11 గంటల ప్రాంతంలో జరిగిన పేలుళ్లలో ఆ ప్రాంతంలోని పలు ఇళ్లపై బండరాళ్లు ఎగిరిపడ్డాయి. దీంతో నివాసాల అద్దాలు, కిటికీలు ధ్వంసమయ్యాయి. అకస్మాత్తుగా భారీ పేలుడు శబ్దాలు వినిపించడం వల్ల స్థానికులు భయాందోళనకు గురయి ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాత్రి వేళ అసలు పేలుళ్లు ఎలా జరుపుతారని స్థానికులు మండిపడ్డారు. ఆ సమయంలో బయట ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణాపాయం తప్పిందని.. ఒకవేళ ఉంటే ఏమయ్యుండేదని వారు నిలదీశారు. ఇలా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే నిర్మాణ సంస్థ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని.. తమ ఇళ్లు ధ్వంసమైన కారణంగా పరిహారం ఇవ్వాలని కాలనీ వాసులు డిమాండ్​ చేశారు. ఈ కథనం పూర్తి వివరాలు కోసం ఈ లింక్​పై క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details