మహారాష్ట్రలో నమోదైన ఓ బ్లాక్ ఫంగస్ కేసు ఆందోళనను కలిగిస్తోంది. నాగ్‌పుర్‌కు చెందిన 70ఏళ్ల వృద్ధుడి శరీరంలోని పెద్ద పేగులో బ్లాక్ ఫంగస్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం ఆయన సెవెన్ స్టార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వ్యాధి కారణంగా ఇప్పటికే ఆయన కంటిచూపు కోల్పోయారు.
Black Fungus: పెద్ద పేగుకు సోకిన బ్లాక్ ఫంగస్ - బ్లాక్ ఫంగస్ వ్యాధి
ఇప్పటి వరకు మానవ శరీరంలోని కళ్లలో, మొదడులో బ్లాక్ ఫంగస్ వ్యాధిని గుర్తించారు వైద్యులు. అయితే.. తాజాగా మహారాష్ట్రలో ఓ వ్యక్తి శరీరంలోని పెద్ద పేగులో బ్లాక్ ఫంగస్ ఉన్నట్లు నిర్ధరించారు డాక్టర్లు. ఇలాంటి కేసు నమోదు కావటం రాష్ట్రంలోనే తొలిసారని వైద్యులు తెలిపారు.
బ్లాక్ ఫంగస్
కొద్దిరోజుల క్రితం వృద్ధుడు తీవ్రమైన కడుపునొప్పితో బాధపడగా.. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. వైద్యపరీక్షలు నిర్వహించిన డాక్టర్లు.. పెద్ద పేగులోని చివరి భాగంలో ఆరు అంగుళాల మేర.. బ్లాక్ ఫంగస్ వ్యాపించి ఉన్నట్లు గుర్తించారు.
ఇదీ చదవండి:కొవిడ్ నుంచి కోలుకున్న వారిలో పెరుగుతున్న గుండె పరిమాణం!