అసోం, బంగాల్ శాసనసభ ఎన్నికలకు సంబంధించిన మిగతా అభ్యర్థులను ప్రకటించడానికి భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ దిల్లీలో భేటీ అయింది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఆయనతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్నారు. నాలుగు రాష్టాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతంలో జరిగే ఎన్నికలకు సంబంధించి తమ పార్టీ తరఫున అభ్యర్థుల పేర్లను ఖరారు చేయడానికి భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కావడం ఇది రెండో సారి.
అభ్యర్థుల ఎంపికపై భాజపా సీఈసీ చర్చ - శాసనసభ ఎన్నికలు
అసోం, బంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు మిగతా అభ్యర్థులను ఖరారు చేసేందుకు భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ దిల్లీలో సమావేశమైంది. ఈ భేటీకి ప్రధాని మోదీ సహా కీలక నేతలు హజరయ్యారు.
భాజపా కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ
అసోం, బంగాల్లో జరుగనున్న మొదటి, రెండో విడత పోలింగ్‌కు భాజపా అభ్యర్థులను ప్రకటించింది. అసోంలో మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు గానూ మార్చి 27, ఏప్రిల్ 1, ఏప్రిల్ 6న మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. బంగాల్లో 8 విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో ఏప్రిల్6న ఒకే దఫాలో పోలింగ్ జరగనుంది.
ఇదీ చదవండి:అసోం సీఎం ఎంపికకు భాజపా 'ఎంపీ' ఫార్ములా!
Last Updated : Mar 13, 2021, 10:19 PM IST