తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గుజరాత్​లో​ 2 రాజ్యసభ స్థానాలూ భాజపా కైవసం - రెండు రాజ్యసభ స్థానాలు భాజపా సొంతం

గుజరాత్​లో ఖాళీ ఏర్పడిన రెండు రాజ్యసభ స్థానాలు ఎలాంటి పోటీ లేకుండానే భారతీయ జనతాపార్టీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్​ అభ్యర్థులను నిలపకపోవటం వల్ల భాజపా అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ahmed-patel-in-rajya-sabha-bypolls
గుజరాత్​లో​ రెండు రాజ్యసభ స్థానాలు భాజపా కైవసం

By

Published : Feb 23, 2021, 5:13 AM IST

గుజరాత్‌లోని రెండు రాజ్యసభ స్థానాలు భారతీయ జనతాపార్టీకి ఏకగ్రీవమయ్యాయి. ఆయా స్థానాలలో.. కాంగ్రెస్ అభ్యర్థులను నిలపకపోవటం వల్ల భాజపా అభ్యర్థులు దినేశ్ చంద్ర అనవడియా, రాంభాయ్ మొకారియాలు ఏకగ్రీవంగా గెలుపొందారు.

నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ సోమవారంతో ముగియగా.. బరిలో ఉన్న డమ్మీ అభ్యర్థులు తమ నామపత్రాలు ఉపసంహరించుకున్నారు. దీంతో భాజపా అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.

సిట్టింగ్ ఎంపీలుగా ఉన్న కాంగ్రెస్‌ సీనియర్ నేత అహ్మద్ పటేల్‌తో పాటు భాజపా నేత అభయ్ భరద్వాజ్ మరణంతో ఖాళీ అయిన స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో.. 1993 నుంచి కాచుకున్న అహ్మద్ పటేల్ స్థానం సైతం కాషాయ పార్టీకి ఏకగ్రీవమైంది. 182 మంది సభ్యులున్న గుజరాత్ శాసనసభలో భారతీయ జనతాపార్టీకి 111మంది సభ్యులు బలం ఉండగా.. కాంగ్రెస్‌కు 65 మంది ఎమ్మెల్యేలున్నారు. విజయావకాశాలు తక్కువగా ఉన్న నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థులను బరిలో నిలపలేదు.

ఇదీ చూడండి:'ఎన్నికలు జరిగే ప్రతి రాష్ట్రంలో బలగాల మోహరింపు'

ABOUT THE AUTHOR

...view details