భాజపా-ఆర్ఎస్ఎస్ నేతలు నిజమైన హిందువులు కాదన్నారు (rahul gandhi news) కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. కేవలం స్వలాభాల కోసమే వారు హిందూ మతాన్ని ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. అఖిల భారత మహిళా కాంగ్రెస్ను ప్రారంభించిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
"వీళ్లు ఏరకంగా హిందువులు? వీళ్లు నిజమైన హిందూవులు కారు. స్వలాభం కోసం హిందూ మతాన్ని ఉపయోగించుకునే దళారీలు. భాజపా, కాంగ్రెస్ సిద్ధాంతాలు రెండు భిన్నమైనవి. ఏదో ఒక సిద్ధాంతం మాత్రమే దేశాన్ని పాలించగలదు. భాజపా-ఆర్ఎస్ఎస్లు హిందూ పార్టీలుగా ప్రకటించుకున్నాయి. కానీ గత 100-200 ఏళ్లలో హిందూ మతాన్ని సరిగ్గా అర్థం చేసుకుని దానిని పాటించింది ఒక్క మహాత్మ గాంధీనే."