తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నుస్రత్ జహాన్ పెళ్లి వ్యవహారంలో కొత్త చిక్కులు! - నుస్రత్ జహాన్ పెళ్లి భాజపా ఫిర్యాదు

నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్​కు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. తన పెళ్లి చెల్లదని ఆమె చేసిన వ్యాఖ్యలపై భాజపా ఎంపీ సంఘమిత్ర అభ్యంతరం తెలిపారు. లోక్​సభ బయోడేటాలో తనకు పెళ్లైందని చెప్పి, పేరు చివరన భర్త పేరు కలిపి ప్రమాణ స్వీకారం చేసిన ఆమెపై స్పీకర్​కు ఫిర్యాదు చేస్తామన్నారు.

TMC MP Nusrat Jahan
నుస్రత్ జహాన్​

By

Published : Jun 22, 2021, 3:38 PM IST

నటి, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ నుస్రత్ జహాన్​.. తన పెళ్లి చెల్లదని చేసిన వ్యాఖ్యలపై భాజపా ఎంపీ సంఘమిత్ర మౌర్య అభ్యంతరం తెలిపారు. లోక్​సభ బయోడేటాలో తనకు వివాహమైందని, భర్త పేరు నిఖిల్ జైన్​ అని నుస్రత్​ జహాన్ పేర్కొన్నారని గుర్తు చేశారు. ప్రమాణ స్వీకార సమయంలోనూ తన పేరు చివరన భర్త పేరు కలిపి నుస్రత్​ జహాన్​ రూహీ జైన్​ అని చదివారని వివరించారు. ఇప్పుడు ఆమె పెళ్లి చెల్లదనడమేంటని ప్రశ్నించారు.

ఈ విషయంపై లోక్​సభ స్పీకర్​కు ఫిర్యాదు చేస్తానని సంఘమిత్ర మౌర్య చెప్పారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తానన్నారు.

ఇదీ చూడండి:నిఖిల్​తో పెళ్లైంది.. కానీ చెల్లదు: ఎంపీ నుస్రత్​

ABOUT THE AUTHOR

...view details