తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మా నాన్న ఎవరో తెలుసా?'.. ఎమ్మెల్యే కుమార్తె రగడ.. పోలీసులతో ఫైట్! - అరవింద్​ లింబావలి కారు వార్త

ర్యాష్​ డ్రైవింగ్​ చేస్తున్న ఓ భాజపా ఎమ్మెల్యే కుమార్తె కారును ఆపినందుకు పోలీసులతో ఆమె తీవ్ర వాగ్వాదానికి దిగింది. సోషల్​ మీడియాలో ఆ వీడియో వైరల్​ అవ్వడం వల్ల ఆమె తండ్రి పోలీసులకు క్షమాపణలు తెలిపారు. ఆమెకు విధించిన జరిమానాను కూడా చెల్లించారు.

BJP MLA's daughter argues with traffic cops in Bengaluru
BJP MLA's daughter argues with traffic cops in Bengaluru

By

Published : Jun 10, 2022, 1:33 PM IST

BJP MLA Daughter Rash Driving: కర్ణాటకలోని ఓ భాజపా ఎమ్మెల్యే కుమార్తె అధికార దర్పం ప్రదర్శించింది. పోలీసులతో తీవ్రస్థాయిలో గొడవ పడింది. ర్యాష్​ డ్రైవింగ్​ చేయటమే కాకుండా పోలీసులతో దురుసుగా వ్యవహరించిన వీడియో వెలుగులోకి రాగా.. సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.

భాజపా ఎమ్మెల్యే కుమార్తె రేణుక లింబావళి
అరవింద్​ లింబావళి, భాజపా ఎమ్మెల్యే

ఏం జరిగిందంటే?.. బెంగళూరులోని మహదేవపుర భాజపా ఎమ్మెల్యే అరవింద్ లింబావళి కుమార్తె రేణుక లింబావళి తన స్నేహితురాలితో కలిసి బీఎండబ్ల్యూ కారులో ర్యాష్​గా డ్రైవింగ్​ చేస్తూ వెళ్లింది. రాజ్​భవన్​ రోడ్డులో పోలీసులు ఆమె కారును ఆపే ప్రయత్నం చేశారు. పట్టించుకోకుండా వెళ్లటం వల్ల పోలీసులు వెంబడించి మరీ ఎమ్మెల్యే కుమార్తె కారును ఆపారు. వెయ్యి రూపాయల జరిమానా కూడా విధించారు . దీంతో తాను ఎమ్మెల్యే కుమార్తెనంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగింది. ఆమె దురుసు ప్రవర్తనను మీడియా ప్రతినిధులు రికార్డు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అరవింద్​ లింబావళి తన కుమార్తె తరఫున క్షమాపణలు చెప్పారు. ఫైన్ కూడా చెల్లించినట్లు చెప్పారు. ఈ ఘటనను ఇంతటితో వదిలేయాలని విజ్ఞప్తి చేశారు.

ABOUT THE AUTHOR

...view details