UP BJP Manifesto: ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ 'లోక్ కళ్యాణ్ సంకల్ప పత్ర' పేరిట మేనిఫెస్టో విడుదల చేసింది. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ ఇది కేవలం ప్రకటన పత్రం కాదని, ఇది యూపీ ప్రభుత్వ తీర్మానమని వ్యాఖ్యానించారు. 2017లో ఇచ్చిన 212 హామీల్లో 92 శాతం నేరవేర్చామన్న ఆయన తాము చెప్పిందే చేస్తామని వెల్లడించారు.
యూపీలో తిరిగి అధికారంలోకి వస్తే వచ్చే ఐదేళ్లలో రాష్ట్ర తలసరి ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని షా హామీ ఇచ్చారు. రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల వరకు పెట్టుబడులను రప్పించే ప్రయత్నాలు చేస్తున్నట్లు మేనిఫెస్టోలో వివరించారు. వచ్చే ఐదేళ్ల కాలంలో మూడు కోట్ల కొత్త ఉద్యోగాలు కల్పిస్తామని, ప్రతి కుటుంబంలో కనీసం ఒక్కరికి ఉద్యోగం లభించేలా చూస్తామని చెప్పారు.
అన్నదాతల కోసం...
- సాగునీటి కోసం రైతులకు ఉచిత విద్యుత్.
- గోధుమ, వరి పంటకు కనీస మద్దతు ధర.
- చక్కెర మిల్లుల పునరుద్ధరణకు రూ.5 వేల కోట్లు ఖర్చు చేస్తామని హామీ.
- వచ్చే 15 ఏళ్లలో చెరుకు సంబంధిత బకాయిల మాఫీ.