జమ్ముకశ్మీర్‌లో ఇటీవల జరిగిన డీడీసీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహించాలని భాజపా, దాని మిత్రపక్షాలకు సూచించారు నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా. ఇప్పటికైనా గెలిచిన వారిని ప్రలోభ పెట్టే కార్యక్రమానికి స్వస్తి పలకాలన్నారు. ఇలాంటి చర్యలతో కాషాయ దళం ప్రజాస్వామ్యాన్ని, సంబంధిత సంస్థలను కించపరుస్తోందని విమర్శించారు.
కొత్తగా ఎన్నికైన డీడీసీ సభ్యులను ప్రలోభ పెట్టేందుకు అప్నీ పార్టీ నేత అల్తాఫ్ బుఖారీ ప్రయత్నిస్తున్నారని ఒమర్ ఆరోపించారు. షోపియన్ జిల్లాలో వివిధ పార్టీల నుంచి గెలిచిన నేతలను శ్రీనగర్‌కు తీసుకువచ్చి వారి(అప్నీ ) పార్టీలో చేరమని బలవంతం చేస్తున్నారని అన్నారు.