Birgaon chunav result 2021: ఛత్తీస్‌గఢ్ బీర్గావ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో.. ఓ ప్రత్యేక ఘట్టం ఆవిష్క్రతమైంది. వేర్వేరు వార్డుల నుంచి ఎన్నికల బరిలో దిగిన తండ్రీకుమార్తెలు.. విజయం సాధించారు. కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేసిన ఉబరాన్దాస్ బంజారే, స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగిన సుశీల మార్కండే గెలుపొందారు. దీంతో కుటుంబసభ్యులు ఆనందంలో మునిగిపోయారు.
ఈ గెలుపుపై సుశీల మాట్లాడుతూ.. తండ్రిలాగే తాను కూడా ప్రజాసేవ చేస్తానని స్పష్టం చేశారు.
"నా గెలుపు కన్నా మా నాన్న విజయంపైనే నాకు చాలా సంతోషంగా ఉంది. వాస్తవానికి నేను రాజకీయాల్లోకి రావాలనుకోలేదు. మా నాన్న చాలా సేవ చేస్తారు. రెండుసార్లు కౌన్సిలర్‌గా పనిచేసి, ఇప్పుడు మూడోసారి గెలిచారు. ఆయన్ని చూసిన స్థానికులు.. నన్ను కూడా రాజకీయాల్లోకి వెళ్లమని, తండ్రిలా సేవ చేయమని కోరారు. అందుకే నేను పోటీ చేశాను. నాన్న లాగా నేను కూడా సేవ చేస్తాను."