మానవత్వానికి ప్రతీకలుగా నిలిచారు ఓ తమిళనాడు పోలీసు, మరో కర్ణాటక బైకర్. బస్సులో ఉన్న ఓ మహిళ చేజార్చుకున్న మందులను ఛేజ్ చేసి మరీ ఆమెకు చేరవేర్చగలిగారు వీరిద్దరూ. ఈ వీడియో కాస్తా వైరల్ కాగా.. వారికి సామాజిక మాధ్యమాల్లో ప్రశంసలు లభిస్తున్నాయి.
వీడియోలో.. బైకర్ (ఆనీ అరుణ్)ను ఆపి.. అతను కర్ణాటకకు చెందిన వాడేనా? అని పోలీసు ఆరాదీస్తాడు. అరుణ్ అవుననగానే.. 'ఇదే దారిలో ముందు ఓ కర్ణాటక బస్సు వెళ్తోంది. అందులో ఉన్న ఓ వృద్ధురాలు ఈ మందులు పోగొట్టుకున్నారు. కాస్త బస్సును ఛేజ్ చేసి ఇది ఆవిడకు అందించగలవా..' అని అడుగుతాడు పోలీసు.