Bihar Student suicide Kerala: ఆర్థిక కారణాలు, భవిష్యత్‌పై ఆందోళనతో బిహార్‌కు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కేరళ మంగళూరులో తాను ఉంటున్న హాస్టల్లో గదిలోనే బలవన్మరణానికి పాల్పడ్డాడు.
Engineering student suicide
మృతి చెందిన యువకుడు(19) సూరత్కల్ ఎన్ఐటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఉదయం నుంచి కనిపించకుండాపోయేసరికి గదిలోకి వెళ్లి చూసిన తోటి విద్యార్థులకు.. యువకుడు తాడుకు వేలాడుతూ శవమై కనిపించాడు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు విద్యార్థులు.
సూసైడ్ నోట్
యువకుడి గదిలో సూసైడ్ నోట్‌ను గుర్తించారు పోలీసులు. 'నేను విద్యారుణం తీసుకొని చదువుకుంటున్నా. ఇంజినీరింగ్ అయిపోయిన తర్వాత నాకు జాబ్ వస్తుందో రాదో! నా చావుకు నేనే బాధ్యుడ్ని' అని యువకుడు సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు.
తల్లిదండ్రులకు సమాచారమిస్తే...
యువకుడి కుటుంబ సభ్యులు చాలా పేదవారని మంగళూరు సిటీ కమిషనర్ శశికుమార్ తెలిపారు. తమ కుమారుడికి మృతదేహానికి మంగళూరులోనే అంత్యక్రియలు నిర్వహించాలని కోరారని చెప్పారు. బిహార్ నుంచి వచ్చి మృతదేహాన్ని తీసుకెళ్లే స్తోమత తమకు లేదని తల్లిదండ్రులు పేర్కొన్నట్లు వివరించారు. దీంతో ఎన్ఐటీ విద్యార్థులు, అధ్యాపక సిబ్బంది కలిసి డబ్బులు పోగు చేసి.. మృతదేహం తరలించే ఏర్పాట్లు చేశారని చెప్పారు.
యువకుడి మరణంపై తల్లిదండ్రులు ఎలాంటి సందేహాలు వ్యక్తం చేయలేదని శశికుమార్ వెల్లడించారు. సూరత్కల్ పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకున్నారని తెలిపారు.
ఇదీ చదవండి:యాచకులకు దానంగా పాడైన ఆహారం.. తిరిగి వ్యాపారులకు విక్రయం!