బిహార్ పంచాయతీ ఎన్నికల్లో (Bihar panchayat election 2021) ఓ అభ్యర్థి వినూత్నంగా నామినేషన్ వేశారు. దున్నపోతుపై ఊరేగింపుగా వచ్చి నామపత్రాలు (Election nomination) సమర్పించారు. కటిహార్ జిల్లాలోని రాంపుర్ పంచాయతీలో (Rampur Bihar) ఇది జరిగింది.
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు (Petrol price) ఆకాశాన్నంటిన నేపథ్యంలో.. వాటిని కొనే శక్తి తనకు లేదని అభ్యర్థి ఆజాద్ ఆలమ్ చెప్పుకొచ్చారు. 'నేనో పశుపోషకుడిని. పెట్రోల్, డీజిల్ కొనే స్తోమత లేకనే.. ఇలా దున్నపోతుపై వచ్చాను' అని చెప్పారు.