తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సీట్లు పెరిగినా భాజపాకు ఓట్లు మాత్రం తగ్గాయ్​! - chirag paswan latest news

బిహార్​ శాసనసభ ఎన్నికల్లో భాజపాకు సీట్లు పెరిగినా ఓట్లు మాత్రం తగ్గాయి. 2019 లోక్​సభ ఎన్నికల్లో వచ్చిన ఓట్లు ఈసారి రాలేదు. ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ భాజపా ఓట్ల శాతం భారీగా తగ్గింది.

bihar election results -bjp-voting  percent -reduced
సీట్లు పెరిగి, ఓట్లు తగ్గిన భాజపా

By

Published : Nov 11, 2020, 6:21 AM IST

అధిక సీట్లు గెలుచుకుని, బిహార్​ ఎన్​డీఏలో సీనియర్ భాగస్వామిగా అవతరించింది భాజపా కానీ 2019 లోక్​సభ ఎన్నికల స్థాయిలో మాత్రం ఓట్లను రాబట్టుకోలేక పోయింది. నాడు ఎల్​జేపీతో కలిసి ఎన్​డీఏకు రాష్ట్రంలో 53శాతం ఓట్లు.. మొత్తం 40 ఎంపీ స్థానాల్లో 39 సీట్లు దక్కాయి.

ఎన్నికల కమిషన్ ప్రస్తుత గణాంకాల ప్రకారం ..

  • ఎన్​డీఏకు 40శాతం లోపు ఓట్లే పోలయ్యాయి. ఆ ర్జేడీ నేతృత్వంలోని మహాకూటమి 37శాతం ఓట్లకు పరిమితమైంది.
  • 2019 సార్వత్రిక ఎన్నికల్లో 21.81శాతం ఓట్లు పొందిన జేడీ(యూ)...ఇప్పుడు 15శాతం ఓట్లే తెచ్చుకుంది. నాడు 23.58శాతం ఓట్లు రాబట్టిన కాషాయ పార్టీ..తాజాగా 20శాతం ఓట్లకే పరిమితమైంది.
  • పలు రాష్ట్రాల్లో జరిగిన ఉపఎన్నికల్లోనూ భాజపా ఓట్ల శాతం తగ్గింది. ఆ పార్టీకి ఝార్ఖండ్​లో 33(2019లో 55శాతం), హరియాణాలో 36(2019లో 58శాతం) ఓట్లు పోలయ్యాయి.

చతికిలపడ్డ ఎల్​జేపీ..

బిహార్ ఎన్నికల్లో యువకెరటం చిరాగ్​ పాసవాన్​ నేతృత్వంలోని ఎల్​జేపీ సత్తా చాటలేక చతికిల పడింది. ఎన్​డీఏతో విభేదించి ఒంటరిగా పోటీ చేసిన చిరాగ్​ పాసవాన్​ సాహసం ఎంతో కొంత ఫలిస్తుందన్న అంచనాలన్నీ తాజా ఫలితాలతో పటాపంచలయ్యాయి. తండ్రి రాంవిలాస్​ పాసవాన్​ మరణం కారణంగా సానుభూతి వెల్లువెత్తి ఆయనకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఓట్లు దక్కుతాయన్న విశ్లేషణలూ తప్పాయి. గత ఎన్నికల్లో గెల్చుకున్న రెండు స్థానాలనూ ఆ పార్టీ కాపాడుకోలేక పోయింది. అతి కష్టంమీద ఒక్క సీటును గెలుచుకోగలిగింది. ఓట్ల శాతాన్ని స్వల్పంగా పెంచుకోవటమే ఆపార్టీకి దక్కిన ఊరట. అయితే జేడీయూ ఓట్లకు భారీగా గండికొట్టి ఆ పార్టీ విజయావకాశాలను దెబ్బతీసినట్లు ఫలితాల సరళి చెబుతోంది.

7 లక్షల మంది 'నోటా' వైపు

బిహార్​ ఎన్నికల్లో దాదాపు 7 లక్షల మంది ఓటర్లకు తమ అభ్యర్థులు నచ్చలేదని తేలింది. మూడు దఫాల్లో జరిగిన ఎన్నికల్లో వీరందరూ నోటా(నన్​ ఆఫ్​ ది ఎబోవ్​)మీట నొక్కినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇది పోలైన ఓట్లలో 1.69శాతంతో సమానం. 2013లో నోటా ఎంపికను ఓటింగ్​ యంత్రాల్లోకి చేర్చింది ఈసీ.

ABOUT THE AUTHOR

...view details