Bihar Doctor Vaccine News: ఇటీవల బిహార్‌కు చెందిన ఓ వృద్ధుడు 11 సార్లు టీకా తీసుకుని వార్తల్లో నిలిచారు. ఇప్పుడు అటువంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. అదే రాష్ట్రానికి చెందిన ఓ డాక్టర్ ఐదు సార్లు వ్యాక్సిన్ తీసుకున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. దీనిపై వారు దర్యాప్తు చేపడుతున్నారు.
ఇదీ జరిగింది..
కొవిన్ పోర్టల్ వివరాల ప్రకారం.. బిహార్‌లోని పట్నాకు చెందిన సివిల్ సర్జన్ డాక్టర్ విభా కుమారీ సింగ్ గతేడాది జనవరి 28న తొలిడోసు తీసుకున్నారు. మార్చి నాటికి పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈనెల 13న ప్రికాషన్ డోసు తీసుకున్నారు. కానీ ఆమె గతేడాది ఫిబ్రవరి 6న, జూన్ 17న కూడా వ్యాక్సిన్ తీసుకున్నట్లు ప్రభుత్వ రికార్డుల్లో నమోదైంది.