తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామం.. లాలూ ఇంటికి నితీశ్​ - rjd iftar nitish kumar

Nitish Kumar News: బిహార్​ ప్రతిపక్ష పార్టీ ఆర్​జేడీ ఇచ్చిన ఇఫ్తార్ విందుకు సీఎం నితీశ్ కుమార్ హాజరుకావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే ఊహాగానాలను నితీశ్ తిప్పికొట్టారు.

Nitish Participation In RJD Iftar
బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామం.. లాలూ ఇంటికి నితీశ్​

By

Published : Apr 23, 2022, 2:52 PM IST

Nitish kumar RJD Iftar: బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి ఇంట్లో జరిగిన ఇఫ్తార్ విందుకు సీఎం నితీశ్ కుమార్ హాజరు కావటం బిహార్ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. 2017లో లాలూ నివాసంలో జరిగిన ఇఫ్తార్ విందుకు హాజరైన నితీశ్.. ఐదేళ్ల తర్వాత మరోసారి ఒకప్పటి మిత్రపక్షమైన ఆర్జేడీ అధినేత ఇంట్లో జరిగిన వేడుకకు హాజరుకావటంపై రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇఫ్తార్ విందుకు హాజరైన నితీశ్.. రబ్రీదేవితో పాటు లాలూ కుమారులు తేజస్వీ, తేజ్ ప్రతాప్ యాదవ్‌తో ఫొటోలు దిగారు.

లాలు ఇంట్లో ఇఫ్తార్​కు హాజరైన నితీశ్​
లాలు ఇంట్లో ఇఫ్తార్​కు హాజరైన నితీశ్​
లాలు ఇంట్లో ఇఫ్తార్​ విందులో నితీశ్​

RJD Iftar Party: అయితే అవినీతి ఆరోపణల కేసులో లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఝార్ఖండ్ హైకోర్టు బెయిల్‌ ఇచ్చిన గంటల వ్యవధిలోనే సీఎం నితీశ్.. లాలూ ఇంట్లో జరిగిన ఇఫ్తార్ విందుకు వెళ్లడంపై చర్చ జరుగుతోంది. మరోవైపు ఇఫ్తార్ విందుకు హాజరుకావటంపై వస్తున్న ఊహాగానాలను నితీశ్ కుమార్ తోసిపుచ్చారు. ఇఫ్తార్ విందుకు చాలా మంది ఆహ్వానిస్తుంటారని, వెళ్లడానికి రాజకీయాలకు సంబంధం ఏముందని ప్రశ్నించారు. ఆర్​జేడీ నిర్వహించిన ఇఫ్తార్ విందుకు హాజరై.. భాగస్వామ్య పక్షమైన భాజపాకు పరోక్ష సందేశం పంపారన్న ఊహాగానాలను నితీశ్ తోసిపుచ్చారు. మరోవైపు లాలూ పెద్ద కుమారుడు తేజ్​ప్రతాప్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నితీశ్​తో తాను రహస్యంగా మాట్లాడాడని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు.

లాలు ఇంట్లో ఇఫ్తార్​కు హాజరైన నితీశ్​

ABOUT THE AUTHOR

...view details