CM helicopter emergency landing : బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. శుక్రవారం ప్రతికూల వాతావరణం దృష్ట్యా గయలో చాపర్‌ను దించారు. కాసేపు వేచి చూసినా పరిస్థితి మెరుగుపడకపోవడం వల్ల రోడ్డు మార్గంలోనే గయ నుంచి పట్నాకు వచ్చారు నీతీశ్.
సీఎం హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ - nitish kumar chopper emergency landing
ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. సీఎం రోడ్డు మార్గంలోనే గయ నుంచి పట్నాకు వచ్చారు.
సీఎం హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
వర్షాభావ ప్రభావంతో బిహార్‌లోని అనేక ప్రాంతంలో కరవు తరహా పరిస్థితులు ఏర్పడ్డాయి. ఔరంగాబాద్, జెహానాబాద్, గయ జిల్లాల్లో పరిస్థితుల్ని స్వయంగా పరిశీలించాలని ముఖ్యమంత్రి అనుకున్నారు. శుక్రవారం ఏరియల్ సర్వే చేపట్టారు. అయితే.. ప్రతికూల వాతావరణం కారణంగా నీతీశ్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ను గయ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా దించాల్సి వచ్చింది.