భీమ్ ఆర్మీ అధినేత చంద్రశేఖర్ ఆజాద్.. రైతు సంఘం నాయకుడు రాకేశ్ టికాయిత్‌తో శుక్రవారం సమావేశమయ్యారు. రైతు ఉద్యమానికి మద్దతిస్తామన్నారు. పడమర ఉత్తర్ ప్రదేశ్‌కు టికాయిత్గర్వకారణమని ప్రశంసించారు. రాకేశ్‌కు భీమ్ ఆర్మీ మద్దతు పూర్తిగా ఉంటుందన్నారు. ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కేంద్రం శాయశక్తులా ప్రయత్నిస్తోందన్నారు. శాంతియుతంగానే నిరసనలు కొనసాగించాలని.. పక్కదారి పట్టొద్దని అన్నదాతలను కోరారు. మరోవైపు యూపీ గేట్ వద్ద ఆందోళనలు చేస్తున్న రైతులు.. తక్షణమే ఆ ప్రాంతాన్ని గురువారం రాత్రి లోపు ఖాళీ చేయాలని అల్టిమేటం జారీ చేశారు ఘజియాబాద్ కలెక్టర్.
'రైతు ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు సహకరిస్తాం'
రైతు సంఘం నాయకుడు రాకేశ్ టికాయిత్‌తో భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ ఘాజీపుర్‌లో శుక్రవారం సమావేశమయ్యారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని బలోపేతం చేసే దిశగా సహకారం అందిస్తామన్నారు.
'రైతు ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు సహకరిస్తాం'
ఒక వేళ ఖాళీ చేయిస్తే.. తాను ఆత్మహత్య చేసుకుంటానని రైతు నాయకుడు రాకేశ్ టికాయిత్ ప్రకటించారు. ఉద్యమాన్ని నిలిపివేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి :సింఘు వద్ద ఉద్రిక్తత- పోలీస్ అధికారిపై దాడి