బంగాల్లో రాజకీయ హింస కొనసాగుతోంది. నేతాజీ జయంతి వేడుకల సందర్భంగా శనివారం ప్రధాని మోదీ.. బంగాల్‌కు రానున్న నేపథ్యంలో హౌరాలో భాజపా కార్యకర్తలపై తృణమూల్ కార్యకర్తలు దాడి చేశారు. పెద్ద ఎత్తున వాహనాలకు నిప్పంటించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ఘటనను స్థానిక భాజపా నాయకుడు తీవ్రంగా ఖండించారు. తమ పార్టీ కార్యకర్తలపై తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారన్నారు.
మోదీ పర్యటన వేళ.. బంగాల్లో భాజపా కార్యకర్తలపై దాడి
బంగాల్ కోల్‌కతాలో జరగనున్న 'పరాక్రమ్ దివస్' వేడుకలకు ప్రధాని నరేంద్రమోదీ శనివారం హాజరుకానున్న నేపథ్యంలో హౌరాలో భాజపా కార్యకర్తలపై తృణమూల్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. తృణమూల్ పార్టీకి ఇలాంటి రాజకీయాలే కావాలంటే..తాము కూడా ఇదే భాషలో సమాధానం చెప్తామని స్థానిక భాజపా నాయకులు స్పష్టం చేశారు.
మోదీ పర్యటన వేళ బంగాల్లో భాజపా కార్యకర్తలపై దాడి
ఒకవేళ తృణమూల్ పార్టీ ఇలాంటి రాజకీయాలే చేయాలని భావిస్తే.. తాము కూడా ఇదే భాషలో సమాధానం చెప్తామన్నారు.
ఇదీ చదవండి :బంగాల్లో నేతాజీ జయంతి వేడుకలకు మోదీ