అఖిల భారత వ్యాపారుల సమాఖ్య (సీఏఐటీ) చేపడుతున్న 'భారత్ వ్యాపార్ బంద్'కు మిశ్రమ స్పందన వచ్చే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. ఈ బంద్ ప్రభావం మార్కెట్లపైన కేవలం పది శాతమే ఉంటుందని అఖిల భారత వ్యాపార మండలి సమాఖ్య అభిప్రాయపడింది. బంద్‌పై ముందస్తు సమాచారం లేని కారణంగా తాము ఈ బంద్‌లో పాలుపంచుకోవడం లేదని వ్యాపారులు తెలిపారు. ప్రధానంగా ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈ పరిస్థితి నెలకొంది.
బంగాల్లో మూతపడిన మార్కెట్లు బంగాల్లో మూతపడిన మార్కెట్లు విజయంవంతం అవుతుంది..
బంద్ ప్రభావంపై వ్యాపార వర్గాల్లో మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నా.. సీఏఐటీ మాత్రం దీనిపై ధీమా వ్యక్తం చేస్తోంది. బంద్ విజయవంతం అవుతుందని పేర్కొంది. మార్చి 1 నుంచి నిరసనలను ఉద్ధృతం చేస్తామని సీఏఐటీ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ వెల్లడించారు.
పెట్రో ధరలు, నూతన ఈ-వే బిల్లు, జీఎస్టీపై నిరసనగా సమాఖ్య శుక్రవారం బంద్‌కు పిలుపునిచ్చింది.
ఇదీ చదవండి :18వేల అడుగుల వైశాల్యంలో భవర్లాల్ చిత్రం