ఇస్లామిక్ మతప్రబోధకుడు జకీర్ నాయక్‌పై ముస్లిం యువతను తీవ్రవాదం వైపు దారిమళ్లిస్తున్నారనే ఆరోపణలున్నాయి. తాజాగా జకీర్ నాయక్‌కు అక్రమ మార్గంలో కోట్లాది రూపాయల విరాళాలు అందినట్లు ఎన్పోర్స్మెంట్ డైరెక్టరేట్ గుర్తించింది. జకీర్ నిర్వహించే ట్రస్టు, ఆయన వ్యక్తిగత ఖాతాల్లోకి కొన్నేళ్లుగా అజ్ఞాత శ్రేయోభిలాషుల నుంచి వేల కోట్లు జమయినట్లు అధికారులు తెలిపారు.
విదేశాల నుంచి విరాళాలు..
జకీర్ ప్రసంగాలకు ఆకర్షితులై యూఏఈ, సౌది అరేబియా, బహ్రెయిన్, కువైట్, ఒమన్, మలేసియా వంటి దేశాల నుంచి ఆయన శ్రేయోభిలాషులు భారీ నిధులు పంపారు. వివిధ బ్యాంకుల్లో శ్రేయోభిలాషులు అనే పేరుతో డిపాజిట్ చేసినందువల్ల సొమ్ము ఎవరు పంపారనే వివరాలు గుర్తించలేక పోయినట్లు అధికారులు తెలిపారు.
ఈడీ విచారణను తప్పించుకునేందుకు ప్రస్తుతం మలేసియాలో తలదాచుకుంటున్నారు జకీర్.