తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అనుమానంతో చెట్టుకు వేలాడదీసి చితకబాదారు

ఉత్తరాఖండ్​ హరిద్వార్​లో మొబైల్​ దొంగతనం చేశాడని అనుమానంతో ఓ యువకుడిని పక్కింటివారే తీవ్రంగా కొట్టారు. చెట్టుకు తలకిందులు వేలాడదీసి చితకబాదుతూ వీడియోలో చిత్రీకరించారు. వైరల్​గా మారిన ఈ వీడియోను చూసి పోలీసులే నిర్ఘాంతపోయారు.

మొబైల్​

By

Published : Aug 9, 2019, 6:55 PM IST

ఉత్తరాఖండ్​ హరిద్వార్​లో దారుణం చోటుచేసుకుంది. మొబైల్​ దొంగలించాడన్న అనుమానంతో పక్కింటివారే జుల్ఫాన్​ యువకుడిని తీవ్రంగా కొట్టిన ఘటన సిడ్కుల్​ ఠాణా పరిధిలోని గాడోవాలిలో జరిగింది. చెట్టుకు తలకిందులుగా వేలాడదీసి ఇష్టారీతిన చితకబాదిన వీడియో వైరల్​ అయింది. పోలీసులు ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేశారు.

వీడియో చూసి నిర్ఘాంతపోయామని పోలీసులు తెలిపారు. ఘటనకు కారణమైన వారిని కచ్చితంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు. వీడియో ఆధారంగా ముగ్గురిపై కేసు నమోదు చేశారు.

తప్పుడు ఆరోపణలు చేసి కావాలని కొట్టారని జుల్ఫాన్​ ఆవేదన వ్యక్తం చేశాడు. వారికి తప్పనిసరిగా శిక్ష పడాల్సిందేనన్నాడు.

మొబైల్​ పోయిందని చెట్టుకు వేలాడదీసి చితకబాదారు

"మొబైల్​ దొంగతనం చేశానని నాపై పక్కింటి వారే తప్పుడు ఆరోపణలు చేశారు. నేను ఎంత చెప్పినా వినకుండా చెట్టుకు కట్టేసి కొట్టారు. వాళ్లు ఆరు నుంచి ఏడుగురు ఉన్నారు. కానీ ముగ్గురిపైనే కేసులు నమోదు చేశారు. వాళ్లు చేసింది తప్పు. అందరికీ శిక్ష పడాలి."

- జుల్ఫాన్​, బాధితుడు

ఇదీ చూడండి: కేరళలో విధ్వంసం సృష్టిస్తున్న భారీ వర్షాలు

ABOUT THE AUTHOR

...view details