తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టండి.. సర్కస్​ చేయడం కాదు'

నోబెల గ్రహీత అభిజిత్ బెనర్జీపై కేంద్ర మంత్రి పీయూష్​ గోయల్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ తప్పుబట్టారు. అనుకున్న రంగంలో అంకితభావంతో పని చేసి అభిజిత్​ అవార్డు దక్కించుకున్నారని ప్రశంసించారు. ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడమే ప్రభుత్వం పనని.. సర్కస్ నడిపించడం కాదని విమర్శించారు.

'ఆర్థిక వ్యవస్థ గాడిలో పెట్టండి.. సర్కస్​ చేయడం కాదు'

By

Published : Oct 19, 2019, 6:10 PM IST

Updated : Oct 19, 2019, 9:46 PM IST

'ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టండి.. సర్కస్​ చేయడం కాదు'

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ... కేంద్ర మంత్రి పీయూష్ గోయల్​పై విమర్శలు గుప్పించారు. నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీపై గోయల్ చేసిన వ్యాఖ్యలను ప్రియాంక తప్పుబట్టారు. ప్రభుత్వం పని కుప్పకూలుతున్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడమే కానీ.. కామెడీ సర్కస్​ను నడపడం కాదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

ఇటీవల ఓ కార్యక్రమంలో గోయల్ మాట్లాడుతూ.. అభిజిత్​ బెనర్జీ కాంగ్రెస్ ప్రతిపాదించిన కనీస ఆదాయ పథకం 'న్యాయ్​'కు మద్దతు తెలిపారని పేర్కొన్నారు. అయితే దేశ ప్రజలు దానిని సున్నితంగా తిరస్కరించారని.. అందువల్ల ఆయన చెప్పిన మాటలు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. బెనర్జీని వామపక్ష వాదిగా గోయల్ అభివర్ణించారు.

ఈ వ్యాఖ్యలపై ప్రియాంక స్పందిస్తూ... భాజపా నాయకులు వారి పని చేయకుండా.. ఇతరులు సాధించిన విజయాలను తప్పుబడుతున్నారని ఆరోపించారు. బెనర్జీ నిజాయతీగా పని చేసి.. నోబెల్​ దక్కించుకున్నారని ప్రియాంక ట్వీట్​ చేశారు.

ప్రియాంక ట్వీట్​

భారత సంతతికి చెందిన అమెరికన్ అభిజిత్ బెనర్జీకి.. ఆర్థిక శాస్త్రంలో 2019కి గాను ఇటీవల నోబెల్ పురస్కారం దక్కింది.

ఇదీ చూడండి: 'అసెంబ్లీ పోరు': ముగిసిన ప్రచార పర్వం.. 21న ఎన్నికలు

Last Updated : Oct 19, 2019, 9:46 PM IST

ABOUT THE AUTHOR

...view details