ఉత్తరాఖండ్ ఉత్తరకాశీలోని ప్రసిద్ధ యమునోత్రిధాం ఆలయం నుంచి మట్టి, యమునా నది నీరు, హిమాలయ పర్వతాల్లో పెరిగే బ్రహ్మ కమలం పుష్పాన్ని అయోధ్యకు పంపారు పూజారులు. ఆగస్టు 5న రామజన్మభూమి భూమిపూజ కార్యక్రమం కోసం వీటిని అక్కడికి చేర్చేందుకు విశ్వహిందూ పరిషత్ కార్యాలయ బాధ్యులకు అందజేశారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యకు యమునోత్రి మట్టి, యమునా నది నీటిని పంపడం ఆనందంగా ఉందని చెప్పారు ఆలయ పూజారులు.